దేశంలో ఎంట్రీ ఇచ్చిన మరో కొత్త వైరస్..West Nile Fever.. లక్షణాలు ఇవే..!

-

అదేంటో కొత్తగా వచ్చే వైరస్‌లు అన్నీ ముందు కేరళలోనే ఎంట్రీ ఇస్తాయి. ఇప్పుడు తాజాగా వెస్ట్‌ నైల్‌ ఫీవర్‌( West Nile Fever) అని కొత్త వైరస్‌ కేరళ ప్రజలను ఆందోళన కలిగిస్తుంది.త్రిసూర్‌లో వెక్టార్-బోర్న్ డిసీజ్‌తో చికిత్స పొందుతున్న వ్యక్తి మరణించడంతో రాష్ట్రంలో అలర్ట్ కూడా ప్రకటించారు. ఈ మధ్య కాలంలో దేశంలో నమోదైన వెస్ట్ నైలు మొదటి కేసు ఇదేనట. ఈ వైరస్ క్యూలెక్స్ జాతుల దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ వివరాలు, ఆరోగ్య శాఖ ఏమంంటుందో చూద్దామా..!

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితుడు పుటన్‌పురక్కల్ జోబీ (47)తో సన్నిహితంగా మెగిలిన ఇద్దరు వ్యక్తులలో కూడా ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయట.. ప్రస్తుతం వారి రక్త నమూనాలను సేకరించిన ఆర్యోగ శాఖ అధికారులు టెస్ట్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు.

వెస్ట్ నైలు జ్వరం అంటే ఏంటి.? ఎలా వ్యాపిస్తుంది?

వెస్ట్ నైల్ వైరస్ (WNV) అనేది క్యూలెక్స్ జాతికి చెందిన సోకిన దోమల ద్వారా వ్యాపించే ఒక రకమైన అంటు వ్యాధి.
వ్యాధి సోకిన పక్షులను దోమలు కుట్టినప్పుడు ఈ వైరస్ వాటి శరీరంలోకి ప్రవేశిస్తాయి.
ఈ వైరస్ సోకిన దోమలు మనుషులను, ఇతర జంతువులను కుట్టడం ద్వారా వెస్ట్ నైల్ వైరస్‌ను వ్యాప్తి చేస్తాయట.

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. వెస్ట్ నైల్ వైరస్ చాలా తక్కువ సంఖ్యలో కేసులను ప్రయోగశాలలో గుర్తించినట్లు, రక్త మార్పిడి, అవయవ మార్పిడి గర్భధారణ సమయంలో తల్లి నుండి బిడ్డకు ఈ వైరస్ వ్యాపించినట్లు గుర్తించనట్లు తెలిపారు.

వెస్ట్ నైలు జ్వరం లక్షణాలు..

WNV సోకిన చాలా మంది వ్యక్తుల్లో.. ఎటువంటి లక్షణాలు కనిపించటం లేదట.. వైరస్ బారిన పడిన ప్రతి 5 మందిలో ఒకరికి తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులు, వాంతులు, విరేచనాలు లేదా దద్దుర్లతో కూడా జ్వరం రావచ్చు. ఈ వైరస్ సోకిన వారిలో చాలా మంది వ్యక్తులు పూర్తిగా కోలుకుంటారు, అయితే వ్యాధి తగ్గిన తర్వాత అలసట, బలహీనత వారాలు లేదా నెలల పాటు కొనసాగుతుంది. CDC ప్రకారం, WNV సోకిన 150 మందిలో ఒకరికి కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితమై తీవ్రమైన అనారోగ్యాన్ని గురవుతారు. మెదడు వాపు లేదా మెనింజైటిస్ (మెదడు వెన్నుపాము చుట్టూ ఉండే పొరల వాపు) వంటివి ఏర్పడుతుంది.

వెస్ట్ నైలు వ్యాధి చికిత్స ఏంటి..?

ప్రస్తుతానికి.. వెస్ట్ నైల్ వైరస్‌కు టీకా, మందులు అందుబాటులో లేవు. ఓవర్-ది-కౌంటర్ ఈ వైరస్ ద్వారా ఏర్పడే నొప్పి, జ్వరాన్ని తగ్గించడానికి, కొన్ని లక్షణాల నుండి ఉపశమనం పొందేందుకు ఉపయోగపడుతాయి.వ్యాధి తీవ్రమైన సందర్భాల్లో, ఇంట్రావీనస్ లిక్విడ్, నొప్పి మందులు, నర్సింగ్ కేర్ వంటి సహాయక చికిత్సను పొందడానికి రోగులు ఆసుపత్రిలో చేరవలసి ఉంటుంది. మీకు లేదా కుటుంబ సభ్యులకు వెస్ట్ నైల్ వైరస్ వ్యాధి ఉందని భావిస్తే, డాక్టర్లను సంప్రదించడం ముఖ్యం

Read more RELATED
Recommended to you

Exit mobile version