తిమింగలం వాంతి దొరికింది.. కోటీశ్వరురాలైంది..కేజీ కాస్ట్ ఎంతో తెలుసా.?

-

కొన్ని వార్తలను చదివినప్పుడు సాధారణంగా వీక్షకులు నమ్మరు..చెత్తన్యూస్ అని..ఫేక్ న్యూస్ అని కొట్టిపారేస్తుంటారు. కానీ అందులో నిజం లేకుండా ఉండదు కదా.. ఇప్పుడు చెప్పే ఈ వార్తను కూడా మీరు అలానే అనుకుంటారేమో..కానే కాదు..ఎందుకంటే ఒక వాంతుతో ఓ మహిళ కోటీశ్వరురాలైంది అంటే ఎవరూ నమ్మరు కదా..కాని ఆమె నిజంగానే అయిందిగా..జనరల్ గా మనకు వాంతి ఎప్పుడు వస్తుంది..గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడో, తలనొప్పి వచ్చినప్పుడో బ్రెయిన్ విశ్రాంతి తీసుకునే ప్రయత్నంలో భాగంగా పొట్టలో ఉన్న ఆహారాన్ని బయటకు నెడుతుంది. ఆహారాన్ని బయటకు పంపే సిగ్నల్ లో భాగంగానే మనకు వాంతులు అవుతాయి. బలవంతంగా వాంతు కంట్రోల్ చేయటం వల్ల బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అ‌వుతుంది పరిశోధకులు అంటున్నారు. ఇది మనుషులు వాంతుల వెనుక కారణం..మనం వాంతి చేసుకోవటం వల్ల మనకు తప్ప ఎ‌వరికి యూస్ ఉండదు..కానీ తిమింగలం వాంతి చేసుకుంటే..అది తీసుకున్నవాడి దిశమారినట్లే తెలుసా..ఎలాగో ఈ స్టూరీ చదివితే మీకే అర్థమవుతుంది.

డిసెంబర్ 14. మలేసియా… తెరెన్‌గ్గాను లోని మరంగ్‌కి చెందిన 41 ఏళ్ల మహిళ అయిదా జురినా లాంగ్… బీచ్‌లో చేపలు పడుతుండగా… సముద్ర నీటిపై తేలుతూ ఏదో కనిపించింది. అదో పెద్ద ముద్దలా ఉంది. దాన్ని చూసిన ఆమె చెత్త కావచ్చు అనుకుందట. కాసేపటికి అక్కడికి వచ్చిన ఆమె తండ్రికి దాన్ని చూపించింది. సముద్రంలో కాలుష్యం పెరిగిపోతోందని చెప్పింది. కానీ పెద్దాయన కదా.. అనుభవం ఎక్కువే ఉంటుంది కదా. ఆయన దాన్ని అదోలా చూసి… అది తిమింగలం వాంతి కావచ్చు అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయింది. వెంటనే తండ్రీ, కూతురూ కలిసి… దాన్ని పట్టారు. అది ఏకంగా 5 కేజీల బరువు ఉంది. అందులోంచీ చిన్న ముక్క తీసి అగ్గిపుల్లతో వెలిగించాడు. అది కొవ్వొత్తిలా వెలుగుతూనే ఉంది. పైగా తియ్యటి వాసన వస్తుంది. అంతే ఆ తండ్రిలో ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది.

జురినా తన జీవితంలో ఎప్పుడూ తిమింగలం వాంతి గురించి వినలేదు. కానీ తండ్రి ద్వారా తెలిశాక… ఇంటర్నెట్‌లో దాని విలువ ఎంతో చెక్ చేసింది. దెబ్బకి షాకైంది. దానికి అంత రేటు ఉందా అని సంబరపడింది. తర్వాత విషయం అధికారులకు చెప్పారు. గట్టిగా ఉన్న ఆ వాంతి ముద్ద నుంచి చిన్న ముక్కను తీసి… మలేసియా యూనివర్శిటీకి పంపారు. వాళ్లు దాన్ని పరిశీలించి అది అంబెర్‌గ్రిస్ అని చెప్పారు. అంటే తిమింగలం వాంతి అనే. అంతే… జురినా రాత్రికి రాత్రే కోటీశ్వరురాలైంది.

అసలు ఏంటంట తిమింగలం వాంతికి అంత డిమాండ్ ?

అది అరుదైనది. స్పెర్మ్ తిమింగలాల పొట్టలో మాత్రమే అది తయారవుతుంది. ఆ తిమింగలాలు స్క్విడ్ ని మింగుతాయి. ఆ జీవి పొట్టలోకి వెళ్లాక… ఆంబ్రెయిన్ అనే రసాయనం విడుదల చేస్తుంది. దాని కారణంగా స్క్విడ్ ముక్కలవుతుంది. ముద్దలా మారిపోతుంది. ఆ సమయంలో తిమింగలం దాన్ని కక్కితే… అదే వాంతిగా నీటిపై తేలుతుంది. నీటిలో ఉన్నా క్రమంగా అది గట్టిపడిపోయి..కొవ్వొత్తిలా మారిపోతుంది. అలా మారిన దాన్ని అంబెర్‌గ్రిస్ అంటారు.

అంబెర్‌గ్రిస్‌ని దేనికి వాడుతారు?

ఈ అంబెర్‌గ్రిస్ సువాసన వెదజల్లుతుందట…అందువల్లే దాన్ని పెర్ఫ్యూమ్‌లలో వాడుతారు. సెంట్లు ఎక్కువ కాలం సుగంధ పరిమళాలు వెదజల్లాలంటే… ఈ వాంతి అవసరం ఉంది. ఇది తెలిశాక..ఛీ అనిపిస్తుందా.. ఈ వాంతిని కాల్చినప్పుడు ముందుగా చెడువాసన వస్తుంది… కాసేపటికి తియ్యటి వాసనగా అది మారుతుంది.

కేజీ ఎంతంటే..

ప్రస్తుతం ఈ వాంతి ధర కేజీ రూ.30,50,620 దాకా ఉంది. అంటే జురినా తన 5 కేజీల ముద్దను అమ్మితే ఆమెకు రూ.కోటిన్నర దాకా డబ్బు వచ్చినట్లే. ప్రస్తుతం మలేషియా అధికారులు.. దాన్ని అమ్మేందుకు చేయాల్సిన ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నారు. ఇదివరకు మలేసియాలో ఇలాంటివి 18 మాత్రమే దొరికాయట. ఇలా అదృష్టం తలుపుతట్టినట్లు జురినా..చెత్త అనుకున్నది లక్షలు తెచ్చిపెడుతుంది.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version