వాట్ ఏ టాలెంట్ భయ్యా..నాలుకతో అద్భుతం..సూపరేహె..

-

మనం మాములుగా నాలుకతో తినడానికి మాత్రమే వాడుతాము..రక రకాల రుచులను ఆస్వాదించడానికి మాత్రమే నాలుకను ఉపయోగిస్తాము..అదే జంతువులు, పక్షులు విషయానికొస్తే వేరేలా ఉంటుంది.నాలుకతో వేటాడుతుంది. ఇంకోజీవి దాన్ని వడపోతకు వాడుతుంది… మరొకటి నాలుకను స్ట్రా లా వాడేసుకుంటుంది.అలాంటి నాలుకతో ఓ వ్యక్తి అద్భుతం చేసాడు. తన నాలుకతో అద్భుతమైన బొమ్మలను గీసాడు.చిత్రకారులంటే కాన్వాస్, పెయింట్స్, బ్రష్ లు ఉంటే సరిపోతుంది.

తమ ఊహలకు రంగులద్ది సరికొత్త చిత్రాన్ని ఆవిష్కరిస్తారు. కానీ ఓ యువకుడు మాత్రం చాలా డిఫరెంట్. చేత్తో పెయిటంగ్ వేస్తే ఏం గొప్ప అనుకున్నాడో ఏమో.. ఏకంగా నాలుగతో బొమ్మలు గీస్తూ అందరినీ ఆకర్షిస్తున్నాడు..అతను ఎక్కడి వాడో కాదు..మన ఆంద్రా కుర్రాడే..ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా బలిఘట్టం గ్రామానికి చెందిన సుర్ల వినోద్‌ తన అద్భుత ప్రతిభతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. నాలుకతో గోడలమీద, పేపర్‌ల మీద బొమ్మలు గీస్తూ అబ్బురపరుస్తున్నాడు. చిన్ననాటి నుంచి డ్రాయింగ్‌ మీద ఉన్న ఆసక్తితో.

క్లాస్‌రూమ్‌లో బుక్స్‌పై, ఇంటికొచ్చాక గోడల మీద ఏదో ఒక బొమ్మలు గీస్తూ ఉండేవాడు. తాను అందరిలో భిన్నంగా ఉండాలని మొదటి నుంచి తాపత్రయపడుతూ ఉండేవాడు. అందుకే అతనికి ఇష్టమైన పెయింటింగ్‌పై దృష్టి పెట్టాడు..అయితే ఓ వ్యక్తి నాలుకతో బొమ్మలు గీయడం చూసాడు. అతని లాగా గీయాలని ప్రయత్నించాడు. మొదట ఫెయిల్ అయ్యాడు.అలా కొన్నిసార్లు ట్రై చేసి చివరికి సక్సెస్ అయ్యాడు. కృషి, సాధించాలనే కసి ఉంటే సక్సెస్ అవుతారని నిరూపించాడు.లాక్‌డౌన్‌లో దొరికిన ఖాళీ సమయంలో దీనిపై దృష్టి పెట్టి మరింత సాధన చేశాడు. అది చూసిన గ్రామంలో యువకులు, పెద్దలు వినోద్‌ని అభినందించారు. వినోద్‌ ఆసక్తిని తన తల్లిదండ్రులతో పాటు గ్రామంలోని వాళ్లు కూడా ప్రోత్సహించారు. భవిష్యత్తులో వినూత్నమైన మరిన్ని బొమ్మలు గీచి వరల్డ్ వైడ్ గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తున్నాడు.అతడు సక్సెస్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం.. ఆల్ ది బెస్ట్ వినోద్..

 

Read more RELATED
Recommended to you

Exit mobile version