ప్రగతి భవన్ ను బద్దలు కొట్టి బహుజన రాజ్యాధికారం సాధిస్తాం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

-

టిఆర్ఎస్ సర్కారుపై బిఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే తెలంగాణ రాష్ట్రం మరో శ్రీలంక లా మారిన ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నారు. నిర్మల్ మున్సిపాలిటీ లో జరిగిన ఉద్యోగాల భర్తీ లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం సిబి సిఐడి తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ప్రవీణ్ కుమార్.

ప్రగతి భవన్ ను బద్దలు కొట్టి బహుజన రాజ్యాధికారాన్ని సాధిస్తామన్నారు. దళితులకు ఇవ్వాల్సిన ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో తెరాస పార్టీ కార్యాలయాలు నిర్మించడం సరికాదన్నారు. ఇతర రాష్ట్రాల్లో రైతులను ఆదుకునేందుకు వెళ్లిన సీఎం కేసీఆర్ కు తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతులను ఎందుకు ఆదుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో 12వ తేదీ వరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version