జెఎన్‌యులో దాడి రోజున గంట గంటకు ఎం జరిగింది…? మీ కోసం..!

-

జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో (జెఎన్‌యు) జనవరి 5 న జరిగిన హింసాకాండ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సబర్మతి హాస్టల్ వార్డెన్‌లు జెఎన్‌యు పరిపాలనకు సమర్పించిన నివేదికను జాతీయ మీడియా ఛానల్ ఇండియా టుడే సంపాదించింది. జనవరి 5 న సబర్మతి హాస్టల్ నందు విధ్వంసానికి పాల్పడి ముసుగులు ధరించిన కొందరు దుండగులు కర్రలు మరియు లాఠీలతో విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి ప్రవేశించి, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులపై దాడులు చేశారు. భారీ ఆస్తికి కూడా నష్టం వాటిల్లింది. అసలు ఆ రోజు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఎం జరిగిందో చూద్దాం.

సాయంత్రం 4 నుండి 6.45 వరకు

1. మెస్ వార్డెన్, స్నేహ చూసిన దాని ప్రకారం, 4 గంటలకు 40-50 మంది, ముసుగులు ధరించి, హాస్టల్‌లోకి ప్రవేశించారు. హాస్టల్ లో ఉండే ప్రత్యేకించి కొందరు వ్యక్తుల కోసం వెతుకుతున్నారని చెప్పారు, వారు గదుల్లో లేకపోవడంతో తిరిగి వెళ్లిపోయారట.

2. ముగ్గురు వార్డెన్లు సాయంత్రం 5.30 గంటలకు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.

3. హాస్టల్ లో ఉండే వారు అదనపు భద్రత కోరుతూ వార్డెన్లు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సిఎస్ఓ) కు లేఖ పంపించారు. అయినా సరే అదనపు భద్రత కల్పించలేదు, సాయంత్రం 6.45 వరకు పోలీసులు కనపడలేదు.

4. రాత్రి 7 గంటలకు, ముసుగు గ్యాంగ్ తిరిగి హాస్టల్‌కు చేరుకుంది. అయితే ఈ సారి వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు నివేదికలో పేర్కొన్నారు. ఇద్దరు ముగ్గురు అమ్మాయిలూ, అబ్బాయిలు ముసుగులు ధరించి ఆయుధాలు పట్టుకుని వచ్చారట.

5. మెన్స్ విభాగంలో 30 కి పైగా గదులు ధ్వంస౦ చేసారు. అప్పుడు వారు హాస్టల్ లో ఉండే విద్యార్ధులపై దాడులకు దిగారు. హాస్టల్ యొక్క ప్రధాన ద్వారం మరియు మెస్ తలుపులపై గాజు గ్లాస్ కూడా అప్పుడే పగిలినట్టు చెప్పారు.

6. ఈ దాడి సమయంలో, 20 మంది విద్యార్థులు వార్డెన్ స్నేహ ఇంట్లో ఆశ్రయం పొందినట్టు నివేదికలో పేర్కొన్నారు.

7. సీనియర్ వార్డెన్ స్నేహను పిలిచి, ఒక వ్యక్తి దాడి చేసాడని అతను క్యాంపస్ నుంచి పారిపోయాడని ఆమెకు వివరించాడు.

8. రాత్రి 8 గంటలకు క్లీనింగ్ వార్డెన్ వచ్చినప్పుడు, పోలీసులకు మరియు హాస్పిటల్ కు ఫోన్లు చేసారు.

9. భయంతో ఉన్న హాస్టల్స్ లో ఉండే విద్యార్ధులను వార్డెన్లు చేర దీసారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version