మన బాడీ లంగ్వేజీని బట్టి మన ప్రవర్తనని కొంతవరకు అంచనా వేయవచ్చు. సైకాలజీలో ఇదొక అధ్యాయం. మనం చేసే పనులే కాకుండా మనం వేసుకునే బట్టలు, మేకప్, మొదలగు వాటి ద్వారా మన ప్రవర్తనని అంచనా వేయవచ్చు. అలాగే మన జుట్టు రంగుని బట్టి కూడా మన వ్యక్తిత్వాన్ని, మనలోని లక్షణాలని అంచనా వేయవచ్చు. మీ జుట్టు రంగు ఎలా ఉంటే మీలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం.
నల్లని జుట్టు
మీ జుట్టు కావాల్సినదానికన్నా నల్లగా ఉంటే మీరు బాగా ఆలోచిస్తారని అర్థం. ముఖ్యంగా మహిళల్లో నల్లని జుట్టు కలిగినవారు అందంగా కనిపించడంతో పాటు ఆలోచనతో ఉంటారు.
ఎరుపు రంగు జుట్టు
జుట్టు రంగు ఎర్రగా ఉన్నవారు కొంత భయస్థులు. కానీ వీరు సంతోషంగా ఉండడానికి ఇష్టపడతారు. ఎదుటివారిలో సంతోషం వీరికి ఆనందాన్ని ఇస్తుంది. భయపడుతున్నట్టు కనిపించినా కూడా సంతోషాన్ని కోరుకుంటారు.
తెలుపు రంగు జుట్టు
ఈ జుట్టు ఇతర దేశాల వారిలో కనిపిస్తుంది. ఇలాంటి జుట్టు కలిగిన అమ్మాయిలకి అబ్బాయిలు చాలా తొందరగా ఆకర్షణకి గురవుతారు.
గ్రే హెయిర్
గ్రే హెయిర్ కలిగి ఉన్నవారు కాన్ఫిడెంట్ గా కనిపిస్తారు. కానీ గ్రే హెయిర్ కలిగి ఉన్న ఎవరైనా తమ వయసు కంటే ఎక్కువ వయసు వారిగా కనిపిస్తారు.
వివిధ రంగులు గల జుట్టు
పింక్, రెడ్, బ్రౌన్ వంటి రంగులు గల జుట్టు ప్రకృతి పరంగా రాదు. ఇలాంటి వివిధ రకాల జుట్టు రంగులు కలిగి ఉన్నవారు ధైర్యవంతులై ఉంటారు. దేనికైనా రెడీగా ఉండడానికి ఇష్టపడుతూ ఛాలెంజిని స్వీకరించడానికి రెడీగా ఉంటారు.