ఇంగ్లండ్ ఇవాళ్టితో కలిపి ఇప్పటి వరకు నాలుగు సార్లు వరల్డ్ కప్ ఫైనల్స్‌కు చేరుకోగా.. కనీసం ఒక్కసారి కూడా కప్ గెలవలేకపోయింది. మరోవైపు న్యూజిలాండ్ ఇవాళ్టి మ్యాచ్‌తో కలిపి వరుసగా రెండోసారి వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకుంది.
మరికొద్దిసేపట్లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐసీసీ వరల్డ్ కప్ 2019 ఫైనల్ మ్యాచ్ జరగనున్న విషయం విదితమే. కాగా ఇంగ్లండ్ ఇవాళ్టితో కలిపి ఇప్పటి వరకు నాలుగు సార్లు వరల్డ్ కప్ ఫైనల్స్‌కు చేరుకోగా.. కనీసం ఒక్కసారి కూడా కప్ గెలవలేకపోయింది. మరోవైపు న్యూజిలాండ్ ఇవాళ్టి మ్యాచ్‌తో కలిపి వరుసగా రెండోసారి వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకుంది. కానీ ఈ జట్టు కూడా కప్ సాధించలేదు. దీంతో ఈ సారి ఒక కొత్త చాంపియన్‌ను మనం విశ్వవిజేతగా చూడబోతున్నాం.
అయితే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు అనేక సందేహాలు వస్తున్నాయి. వాటిల్లో ఒకటి.. మ్యాచ్ టై అయితే ఏం చేస్తారని..? అయితే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ టై అయిన నేపథ్యంలో ఇరు జట్లతో సూపర్ ఓవర్ ఆడిస్తారు. అందులో గెలుపొందిన జట్టుకు వరల్డ్‌కప్ ట్రోఫీ ఇస్తారు. ఇక ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారితే పరిస్థితి ఏమిటని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. అందుకు సమాధానం ఏమిటంటే…
వరల్డ్ కప్ మ్యాచ్‌లలో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డేలు ఉంటాయని అందరికీ తెలిసిందే. తొలిరోజు వర్షం కారణంగా మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే రెండో రోజు అక్కడి నుంచే ఆటను కొనసాగిస్తారు. తొలి రోజే మ్యాచ్‌ను ముగించాలని చెప్పి ఒక వేళ ఓవర్లను కుదించి మ్యాచ్ పెట్టినా.. ఆ రోజు వర్షం వల్ల ఆట జరగకపోతే.. రెండో రోజు రిజర్వ్ డే రోజున తొలి రోజు కుదించిన ఓవర్ల ప్రకారమే ఆటను కొనసాగిస్తారు. అయితే రెండు రోజులూ వర్షం పడి మ్యాచ్ నిర్వహించడం సాధ్యం కాకపోతే.. అంపైర్లు రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించి వరల్డ్ కప్ ట్రోఫీని ఇద్దరికీ షేర్ చేస్తారు.. మరి ఇవాళ జరగనున్న వరల్డ్ కప్ మ్యాచ్‌లో అదృష్టం ఎవరి పక్షాన నిలుస్తుందో, ఎవరు కప్‌ను ఎగరేసుకు పోతారో చూడాలి..!