బ్లాక్‌మేజిక్ (చేత‌బ‌డి) ఉందా..? లేదా..? నిజ‌మెంత‌..!

-

బ్లాక్‌మేజిక్‌, చేతబడి, బాణామతి, చిల్లంగి, మంత్రాలు అన్నా పేర్లు ఏమైనా క్రియ ఒకటే, ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. ఇది ఒకప్పుడు అమ్మమ్మలు, తాతయ్యలు ఎక్కువగా చెప్పేమాట. ఆ కాలంలో చేతబడి అనేది ఎక్కువగా వినిపించేది. కానీ వాస్తవానికి అవన్నీ కల్పితాలు. ఋజువుకు నిలబడని నమ్మకాలు. అసలు అన్నిటికన్నా హీనమైన చేతబడి మీ మనసులో జరిగేదే. దాంతో పోలిస్తే ఎదుటివాళ్ళు చెయ్యగలిగేది చాలా అత్యల్పం. ఏ రకంగా చూసినా కూడా మీకు మీరు చేసుకోగలిగే అన్యాయమే చాలా ఎక్కువ.

గ్రామాల్లో, పట్టణాల్లో చేతబడి, బాణామతి, మంత్రాలు చేస్తున్నారనే నెపంతో మూఢనమ్మకాల కారణంగా కొంతమందిని వెలి వేయడం, పండ్లూడగొట్టడం వంటి హింసలకు గురి చేస్తున్నారు. వారిపై దాడులు, హత్యలు ఇంకా సజీవ దహనాలు కూడా సాధారణమైపోయాయి. కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ చేతబడి జరుగుతోందని ప్రజలు బలంగా నమ్ముతారు. తమకు ఏదైనా కీడు జరిగినా.. ఉన్నట్టుండి అనారోగ్యం పాలైనా దానికి కారణం గిట్టనివాళ్లు చేసిన చేతబడి ప్రభావమే అని భావిస్తారు.

అలాంటి ఘటనే ఇటీవలే చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం అద్రాసుపల్లి చేతబడి చేస్తున్నాడన్న నెపంతో ఓ యువకుడిపై దాడి చేసి సజీవ దహనం చేసిన దారుణ ఘటన తెలంగాణలో జరిగింది. చేతబడి చేయడం వల్లే లక్ష్మికి అనారోగ్యం తగ్గడం లేదని నమ్మిన లక్ష్మి కుటుంబ సభ్యులు, గొడ్డలితో విచక్షణా రహితంగా నరికారు. కొనప్రాణాలతో ఉన్న అతడిని తీసుకెళ్లి లక్ష్మి చితి మీద పడేశారు. కేకలు వేస్తూ ఆంజనేయులు సజీవ దహనమయ్యాడు.
కానీ.. చేతబడి నమ్మాలా ? అంటే మాత్రం తత్వవేత్తలు ఇదంతా భ్రమ మాత్రమే అని కొట్టిపారేస్తున్నారు. ఇదంతా మనసులో జరిగే హీనమైన చేతబడి అని వివరిస్తున్నారు. ఇతరులు చేసే మాయ, చెడు, మంచి ఏదైనా మనపై అంతగా పనిచేయదంటున్నారు. ఒకవేళ ప్రభావం చూపినా జీవితాన్ని మార్చేసే విధంగా జరగదని తేల్చిచెబుతున్నారు. మనసుని ప్ర‌శాంతంగా, దృఢంగా ఉంచుకుంటే ఎలాంటి మూడ‌న‌మ్మ‌కాలు ద‌రి చేర‌వ‌నే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version