రాజకీయంగా కేసీఆర్ వేసే ఎత్తులు పసిగట్టడం చాలా కష్టమని చెప్పొచ్చు…ఆయన రాజకీయంగా వేసే వ్యూహాలు ప్రత్యర్ధులకు తెలిసేలోపే అసలు విషయం ముగిసిపోతుంది…అంటే అంతలా కేసీఆర్ వ్యూహాలు ఉంటాయి..అయితే ఇదంతా ఒకప్పుడు మాత్రమే…ఇప్పుడు కేసీఆర్ వ్యూహాలు తెలుసుకోవడం కాదు కదా…ముందే ఆయన వ్యూహాలు ఫెయిల్ అయిపోతున్నాయి. పెద్దగా వర్కౌట్ అవ్వడం లేదు. వరుసగా రెండోసారి అధికార పీఠంలో కూర్చున్న కేసీఆర్ పై…ప్రజా వ్యతిరేకత పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే…అదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సైతం పుంజుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో కేసీఆర్ కు రాజకీయంగా ఒక ఆసరా కావాలి…అందుకే కేంద్రాన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు…ఇక వేరేగా టార్గెట్ చేయడానికి ఏమి లేదు…తమపై వచ్చే వ్యతిరేకతని పోగొట్టుకోవడానికి మార్గాలు లేవు..అందుకే కేంద్రంపై ఫోకస్ చేశారు..అబ్బో బీజేపీ వల్ల దేశం నాశనమైపోతుందని, దేశ రాజకీయాలని మార్చేస్తానని స్పీచ్ లు ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే అన్నివేళలా కేసీఆర్ చెప్పింది జనం నమ్మేస్తారు అనుకుంటే పొరపాటే…తమ తప్పులని కవర్ చేసుకుంటూ…కేంద్రాన్ని ఎంతగా టార్గెట్ చేసినా కేసీఆర్ వ్యూహాలు పెద్దగా వర్కౌట్ కావడం లేదు.
కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీని కేసీఆర్ ఏం చేయలేరని అర్ధమవుతుంది…అలాగే తెలంగాణలో బీజేపీ బలపడటాన్ని కూడా ఆపలేకపోతున్నారు. ఎటు చూసిన కేసీఆర్ కు ఇరకాటం లాగానే ఉంది. అయితే రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ కాస్త హడావిడి చేసిన విషయం తెలిసిందే. విపక్షాల అభ్యర్ధి యశ్వంత్ సిన్హాని రాష్ట్రానికి తీసుకొచ్చి మరీ..మోదీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ఏదో రాష్ట్రపతి ఎన్నికల్లో కీలకపాత్ర పోషించి…బీజేపీకి చెక్ పెట్టేద్దామని అనుకున్నారు.
తీరా చూస్తే సీన్ మొత్తం రివర్స్ అయింది..ఎన్డీయే తరుపున నిలబడ్డ ద్రౌపది ముర్ము భారీ మెజారిటీతో గెలిచి రాష్ట్రపతి అయ్యారు. కనీసం విపక్షాల అభ్యర్ధి యశ్వంత్ పోటీ ఇవ్వలేకపోయారు. ఈ ఎన్నికలు బీజేపీ బలానికి ఉదాహరణ అని చెప్పొచ్చు. అలాగే బలమైన బీజేపీని కేసీఆర్ ఏం చేయలేరని చెప్పొచ్చు. అయితే రాష్ట్రపతి ఎన్నికలు అయిపోయాయి…నెక్స్ట్ ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి…మరి అప్పుడు కూడా కేసీఆర్ హడావిడి చేస్తారా? లేక బీజేపీని ఆపడం కష్టమని సైలెంట్ గా ఉంటారో చూడాలి. మొత్తానికైతే కేంద్రాన్ని టార్గెట్ చేసి…రాష్ట్రంలో లబ్ది పొందాలని కేసీఆర్ గట్టిగానే ట్రై చేస్తున్నారు…కానీ ఆ ప్రయత్నాలు అన్నీ వృధా అవుతున్నాయి…రోజురోజుకూ తన బలం పెంచుకుందామని అనుకుంటున్నారు….కానీ టీఆర్ఎస్ బలం రోజురోజుకూ తగ్గుతుంది. మరి ఇలాంటి పరిస్తితుల్లో కేసీఆర్…నెక్స్ట్ ఎలాంటి వ్యూహాలతో ముందుకొస్తారో చూడాలి.