Macharla niyojakavargam: యూట్యూబ్ లో దూసుకుపోతున్న అంజలి ఐటమ్ సాంగ్

-

నితిన్ తన కెరీర్ లో మొట్టమొదటిసారిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ జానర్ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం “మాచర్ల నియోజకవర్గం”. ఈ చిత్రం ఆగస్టు 12 న రిలీజ్ కానుంది. ఎడిటర్ ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి, క్యాథరిన్ తెరిసా హీరోయిన్లుగా నటిస్తుండగా.. అంజలి ఓ స్పెషల్ సాంగ్ లో అలరించనుంది. ఈ మాస్ సాంగ్ జూలై 8న రిలీజ్ కాగా ఈ ఐటమ్ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది.

ఇప్పటివరకు 20 మిలియన్ ప్లస్ వ్యూస్, 300 k లైక్స్ ను ఈ పాట సంపాదించుకుంది.“రా రా రెడ్డి” అంటూ సాగే ప్రోమో ఆకట్టుకుంటుంది. నితిన్, అంజలి మాస్ బీట్ స్టెప్స్ అదిరిపోయాయి అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాలో నితిన్ గుంటూరు జిల్లా కలెక్టర్ గా నటించనున్నాడు. ఆదిత్య మూవీస్ ఎంటర్టైన్మెంట్స్, శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితారెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version