అసదుద్దీన్ పై పోటీ చేయనున్న మాధవీలత బ్యాక్ గ్రౌండ్ ఏంటి…!

-

మరి కొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు జాబితాను విడుదల చేస్తున్నా సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా లోక్ సభ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితాను ప్రకటించింది.16 రాష్ట్రాల్లోని 195 మంది అభ్యర్థులతో కూడిన లిస్టును బీజేపీ విడుదల చేసింది.

ఇందులో తెలంగాణ నుంచి తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించారు.MIM కంచుకోట హైదరాబాద్ స్థానంలో బీజేపీ మహిళకు అవకాశం ఇచ్చింది. ఇక్కడ కొన్నేళ్లుగా అసదుద్దీన్ ఒవైసీ ఎంపీగా గెలుస్తున్నారు. ఈసారి కూడా ఆయనే పోటీ చేసే ఛాన్స్ ఉండటంతో బీజేపీ విరించి హాస్పిటల్స్ ఛైర్పర్సన్ కొంపెల్లి మాధవీలతను బరిలో నిలిపింది. ప్రొఫెషనల్ భరతనాట్య నృత్యకారిణి అయిన ఆమె.. హిందుత్వం, భారతీయ సంస్కృతిపై అనర్గళంగా మాట్లాడగలరు. పాతబస్తీలో తరచూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతూ ప్రజలతో మమేకం అవుతుంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version