కరోనా వైరస్’ ఇప్పుడు చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ ఇది. ప్రపంచ వ్యాప్తంగా వేలాది మందికి ఇప్పుడు ఈ వైరస్ వ్యాపిస్తుంది. దీనితో అంతర్జాతీయంగా హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు. అసలు ఈ వైరస్ లక్షణాలు ఏంటీ…? ఏ విధంగా ఉంటుంది…? దీని వలన ఎన్ని రోజుల్లో ప్రాణం పోతుంది…? ఎప్పుడు పుట్టింది అనేది ఈ స్టొరీలో చూద్దాం.
ఈ వైరస్ ను 1960ల్లో తొలిసారిగా పరిశోధకులు కనుగొన్నారు. పక్షులు, క్షీరదాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. వాటిని తినడంతోనే ఈ వైరస్ సోకుతుంది అని గుర్తించారు. ఈ వైరస్ ని మనుషుల్లో వుహాన్‌లోని ఓ సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్ లో గుర్తించారు. ఒక వైరస్ కారణంగా వుహాన్‌లో ఇద్దరు మృతిచెందడంతో వీరి శాంపిల్స్‌ను లండన్‌ను పంపించి పరిశోధనలు నిర్వహించారు వైద్యులు.
ప్రస్తుతం ఈ వైరస్ సోకిన వారి సంఖ్య, మూడు వేలకు పైగా ఉంది. కరోనా వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్ గానీ, యాంటీ వైరల్ చికిత్సా విధానం గానీ అందుబాటులో లేదు. అసలు కరోనా అంటే లాటిన్ భాషలో కిరీటం అని అర్ధం. ఈ సూక్ష్మజీవిని ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు కిరీటం ఆకృతిలో కన్పించడంతో ఆ పేరు పెట్టారు. చైనాలో ఎక్కువగా ఉండే క్రైట్, కోబ్రా ఈ రెండు కూడా విషపూరితమైన పాముల వలన ఇది వచ్చినట్టు గుర్తించారు.
కాటు వేయడం లేదా వాటిని తినడం వలన వైరస్ సోకి ఉండొచ్చని అంటున్నారు. ఈ వ్యాధి సోకిన నాలుగు వారాల్లో మనిషి మరణిస్తాడు. మానవ కరోనా వైరస్ జాతులు కూడా ఉన్నాయి. వాటిని ఒక్కసారి చూస్తే, హ్యూమన్ కరోనావైరస్ 229ఈ, హ్యూమన్ కరోనావైరస్ ఓసీ43, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్(సార్స్-సీఓవీ), హ్యూమన్ కరోనావైరస్ ఎన్‌ఎల్63, హ్యూమన్ కరోనావైరస్ హెచ్‌కేయూ1, మిడిల్‌ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనావైరస్(మెర్స్-సీఓవీ) అనే జాతులు ఉన్నాయి.
వైరస్ లక్షణాలు ఒకసారి చూస్తే, సోకిన వ్యక్తికి జలుబు చేయడంతో ముక్కు కారుతూనే ఉంటుంది. ఆ తర్వాత క్రమంగా జ్వరం, దగ్గు, ఛాతీలో నొప్పి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు రావడం, అనంతరం తీవ్రమైన న్యుమోనియాకు దారితీసి ప్రాణాలు కోల్పోయే విధంగా చేస్తుంది. చలికాలంలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అది రాకుండా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ముక్కు, నోరు దగ్గర తాకొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. విదేశాలకు వెళ్లినప్పుడు మాంసాహారం తప్పనిసరి బాగా ఉడికించి మాత్రమే తీసుకోవాలని సూచించింది. వ్యాధి సోకిన వారికి కాస్త దూరంగా ఉండాలని వారు దగ్గినా తుమ్మినా సరే మీరు అప్రమత్తంగా వ్యవహరించాలని, నాలుగు రోజుల వరకు వ్యాధి లక్షణాలు బయటపడే అవకాశం ఉండదు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలని అంటున్నారు.