దేశీ మద్యం విదేశీ మద్యానికి తేడాలేంటి..? ఫారెన్‌ మద్యం ఎందుకు ఎక్కువ ధర..?

-

మద్యం ప్రియులకు లోకల్ బ్రాండ్స్ కన్నా..నాన్ లోకల్ వి, ఫారన్ వి అయితే ఇంకా ఎక్కువ ఇష్టం. వాటిలో ఉండే కిక్కే వేరు. క్లాసీగా తాగినంత సేపు నీట్ గా భలే ఉంటుంది. ఆ తేడా మీకు నాకు కాదు..మద్యం అలవాటు ఉన్నవాళ్లకే బాగా తెలుస్తుంది. ఆపిల్ ఫోన్ కు అలవాటైతే..యాండ్రాయిడ్ వాడాలనిపించదు..అలానే..ఫారన్ బ్రాండ్ కి అలవాటుపడితే..లోకల్ నచ్చదు. అంత టేస్టీగా ఉంటుంది మరీ..టేస్ట్ ఒకటే కాస్ట్ కూడా ఎక్కవే. అసలు దేశీ మద్యానికి..విదేశీ మద్యానికి తేడా ఏంటి..బాటిల్ షేప్ నుంచి, లోపల కంటెంట్ వరకూ అన్నీ తేడానే.

వాస్తవానికి..ఈ రెండు దాదాపు ఒకేలా ఉంటాయి. దేశీయ మద్యం, విదేశీ మద్యం తయారీ ప్రక్రియ కూడా.. దాదాపు ఒకే విధంగా ఉంటుంది. దేశీయ మద్యం అనేది శుద్ధి చేయబడిన ఒక రకమైన స్పిరిట్ లేదా స్వేదనం. స్వదేశీ వైన్ తయారీదారులు దీనిని ఇంగ్లీష్ బ్రూయింగ్ కంపెనీలకు పంపుతారు. వారు దేశీయ కంపెనీల నుంచి తక్కువ ధరకు ఈ ద్రావణాన్ని విక్రయిస్తారు. తరువాత రకరకాల రుచులు ఆ ద్రావణానికి కలిపి ఫారెన్ మద్యాన్ని తయారు చేస్తారు. దీనికి వారు ఎక్కువ ధరను నిర్ణయిస్తారు. మ్యాటర్ ఏంటంటే..వాడే ముడి సరుకు మొత్తం ఒక్కటే కానీ వారు అందులో రుచి కోసం కొన్ని రాకాల సుగంధ ద్రవ్యాలు, ప్లేవర్స్ కలుపుతారు. దీంతో ఆ మద్యానికి రుచి, స్వభావం వేరుగా ఉంటుంది. అందుకే దీనికి ఎక్కువ ఉంటుంది.

విదేశీ మద్యం ప్యాకింగ్‌ కూడా భినంగా ఉంటుంది. ఆల్కహాల్, స్కాచ్ లేదా ఫ్లేవర్ పెరుగుదలతో దాని ధర ఆధారపడుతుంది..ఫారన్ బ్రాండ్స్ కి.. ప్రభుత్వం పన్ను కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి దేశీ మద్యం వరిగింజలు, బార్లీ మొదలైన వాటితో తయారుచేస్తారని మద్యం బాటిల్‌పై రాసి ఉంటుంది. దీని రుచి సాదాసీదాగా ఉంటుంది. ఇది కాకుండా ప్రభుత్వం నుంచి పన్ను ప్రయోజనం దొరుకుతుంది. భారతదేశంలో దీని అమ్మకం కూడా ఎక్కువే.

స్వదేశీ, విదేశి మద్యం ఏదైనా..అవి చేసేది ఒకటే..మొదట కిక్కను ఇస్తాయి..ఆ తర్వాతా తాగే కొద్ది స్లో పాయిజన్ లా శరీరంలోకి వెళ్తాయి. ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. ఎక్కువగా తాగితే..ఏ మద్యం అయినా ప్రమాదకరమే..!

Read more RELATED
Recommended to you

Exit mobile version