ఈ గుహలో బుల్లి ప్రపంచమే ఉంది!.తిరిగి కనిపెట్టడానికి 18 ఏళ్లు పట్టిందట..!

-

అనుకోకుండా ఒక గుహలోకి వెళ్లిన వ్యక్తి అది చూసి ఆశ్యర్యపోయాడు. అక్కడి నుంచి అధికారులకు చెప్పి వాళ్లని తీసుకెళ్దామనుకుంటే..అతనికి మళ్లీ దారిగుర్తులేదు. మర్చిపోయాడు. వెతికి వెతికి మొత్తానికి 18 ఏళ్ల తర్వాత అదే గృహను కనిపెట్టాడు. అందులో బుల్లి ప్రపంచమే ఉంది. మొత్తానికి ఆ వ్యక్తి కృషి వల్ల ఇప్పుడు అది పర్యాటక ప్రాంతంగా మారింది. ఆ గుహ ఏంటో..ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం.

1990లో ఓ రైతు అడవిలోకి వెళ్లి దారితప్పాడు. జోరున వాన.. తప్పించుకోడానికి సురక్షిత ప్రాంతాన్ని వెతుకుతూ ఓ పెద్ద గుహ దగ్గరకు చేరాడు. దాదాపు 4 అంతస్తుల ఎత్తైన ఆ గుహను చూసి రైతు ఆశ్చర్యపోయాడు. సహజ సిద్ధంగా ఏర్పడిన నది, రైన్ ఫారెస్ట్, బీచ్‌‌లను చూసి ఆ రైతులకు నోట మాటరాలేదు. వర్షం తగ్గిన తర్వాత సురక్షితంగా తన గ్రామానికి చేరిన రైతు..ఈ విషయాన్ని బ్రిటీష్ కేవింగ్ రీసెర్చ్ అసోసియేషన్ (బీసీఆర్ఏ)కు చేరవేశాడు. తిరుగు ప్రయాణంలో ఆ గుహ ఉన్న ప్రాంతాన్ని గుర్తుపెట్టుకోలేదు. ఫలితంగా తిరిగి ఆ గుహను వెతికేందుకు దాదాపు 18 ఏళ్ల సమయమే పట్టింది. సరిగ్గా పదేళ్ల కిందట దీన్ని మళ్లీ కనుగొన్నారు.

ఈ గుహను కనుగొన్న రైతు పేరు హొఖన్. వియాత్నంలోని నహకే బాంగ్ నేషనల్ పార్క్‌లో ఉన్న ఈ గుహకు ‘హ్యంగ్ సన్ డూంగ్’ అని పేరు పెట్టారు. సుమారు ఐదు కిలోమీటర్లు విస్తరించిన ఈ గుహలోకి 2013 నుంచి పర్యాటకులకు అనుమతి లభించింది. ఫిబ్రవరి నుంచి ఆగస్టు నెల వరకు మాత్రమే ఈ గుహను చూసేందుకు అనుమతి ఇస్తారు. 10 మందికి మించి ఎక్కువ మందిని ఒకేసారి అనుమతించరుట.

ఈ గుహలో చిన్న సైజు రైన్ ఫారెస్ట్ ఉండటం గమనార్హం. అలాగే 80 అడుగుల ఎత్తైన స్పటిక లైమ్ స్టోన్.. శిల, చిన్న బీచ్, భూగర్భ నదులు, అబ్బుర పరిచే శిలాకృతులను చూస్తే..ఆశ్యర్యపోక తప్పరు. అడ్వేంచర్లు ఇష్టపడేవారికి ఈ గుహ కచ్చితంగా నచ్చుతుంది.
హ్యంగ్ సన్ డూంగ్ గుహను ప్రపంచంలోని అతిపెద్ద గుహల్లో మూడోదిగా గుర్తించారు.

ఈ గుహ ఉన్న ప్రదేశం వియాత్నంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం. యుద్ధంలో ఈ ప్రాంతంలో బాంబుల వర్షమే కురిసిందట. అయితే, ఈ భారీ గుహ బయటపడిన తర్వాత ఈ ప్రాంతం పర్యాటకులతో రద్దీగా మారింది. ఇప్పుడు ఈ ప్రాంతం గురించి అక్కడి వారందరికి తెలుసు.

Read more RELATED
Recommended to you

Exit mobile version