ఏంట్రా ఇది..చాక్లెట్‌ తో పకోడీ..టేస్ట్ ఎలాగుందంటే..

-

సోషల్ మీడియాలో కొన్ని రకాల వీడియోలు వైరల్ అవ్వడం మనం చూస్తూనే ఉంటాము..అందులో ఎక్కువగా ఫుడ్ కు సంబంధించిన వీడియోలు మాత్రం సునామీను సృష్టిస్తున్నాయి..రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. చాక్లెట్‌ ను చాలా మంది ఇష్టంగా తింటారు..అయితే ఇప్పుడు వెరైటీ పేరుతో చాక్లెట్‌ తో వంటలు కూడా చేస్తున్నారు. అన్ని వంటలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చాక్లెట్‌ తో చేసిన పకోడీ మాత్రం అందరి నోట్లో నానుతుంది..

డైరీమిల్క్ చాక్లెట్‌తో పకోడీ టేస్ట్ మాత్రం చూసుండం. అంతెందుకు చాలా మందికి అసలు డైరీమిల్క్ చాక్లెట్‌తో పకోడీ ఎలా చేస్తారో కూడా తెలియదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ఫన్నీ కామెంట్లతో రిప్లై ఇస్తున్నారు. ఇప్పటికే మనం నూడుల్స్‌తో రకరకాల వంటకాలు, మనకు తెలియని వెరైటీ వంటకాలు చేయడం గురించి విన్నాం.. చూశాం..

విషయానికొస్తే..రోడ్డు పక్కన బండి పెట్టుకున్న ఒక మహిళ డైరీమిల్క్ చాక్లెట్‌ను తీసుకుని పకోడీల కోసం కలిపిన పిండిలో ముంచి.. పిండితో పాటుగా.. వేడిగా ఉన్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేసింది. తర్వాత ఒక గరిటెతో ఆ చాక్లెట్ పకోడీలను బయటకు తీసింది. వాటి మీద కొంచెం మసాలా, కొంత గ్రీన్ చట్నీ వేసి ఇద్దరు కస్టమర్లకు సర్వ్ చేసింది..దీన్ని తీసుకున్న కస్టమర్లు లొట్టలేసుకుంటూ తిన్నారు…ఈ వీడియోని చూసిన కొంతమంది ఫుడ్ లవర్స్ బాగుందని అంటుంటే.. కొంత మంది మాత్రం ఇదేంట్రా.. అని విసుక్కుంటున్నారు.మొత్తానికి ఈ వీడియో మాత్రం నెట్టింట చక్కర్లు కోడుతుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version