రోగి నాలుక చూసి డాక్టర్ వైద్యం చేస్తాడు.. నాలుక చూస్తే ఏం అర్థమవుతుంది?

-

జ్వరం, తలనొప్పి, విరేచనాలు ఇలా రోగం ఏదైనా సరే డాక్టర్ వద్దకు వెళ్తే ముందుగా నాలుక చూపించమంటాడు. కళ్లు, ముక్కు, నోరు, చెవులు ఇన్ని ఉండగా అసలు నాలుకనే ఎందుకు చెక్ చేస్తారో అన్న సందేహం ఎప్పుడైనా వచ్చిందా? ఇలా పరిశీలించడంతో నాలుక లక్షణాలను బట్టి ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుస్తాయట. వాటి కొన్నింటిని తెలుసుకుందాం.

Why does doctor check tongue during fever

1. నాలుకపై కొందరికి తెల్లమచ్చలు, నల్లమచ్చలు ఇండడాన్ని గమనించే ఉంటారు. ఈ తెల్లమచ్చలకు కారణం ఫంగస్. దీని కారణంగానే ఈ మచ్చలు ఏర్పడుతాయి.
2. నాలుక ఎర్రబారి మెరవడం, అదే సమయంలో ఒంటి రంగు పాలిపోయి ఉండడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడం ఇవన్నీ ఐరన్ లోపం, రక్తహీనత ఉన్నాయని చెప్పే లక్షణాలు.
3. కొందరి నాలుక మీద వెంట్రుకలు మొలిచినట్లుగా నల్లగా కనిపిస్తుంది. దీనికి విపరీతంగా పొగతాగడం వల్ల లేదంటే శక్తివంతమైన యాంటీబయాటిక్స్ వాడడం వల్ల వచ్చే ఫంగస్ కారణమై ఉంటుంది.
4. నాలుక వాపు అనేది ఒక లక్షణం. నాలుక వాచినప్పుడు తినడానికి, మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటుంది. నాలుక వాయడంతో పాటు ఒక్కోసారి రంగు కూడా మారుతుంది. శరీరంలో ఇన్‌ఫెక్షన్లు బాగా పెరిగిపోయినప్పుడు కనిపించే లక్షణం.
5. నాలుక రంగు మారడం అన్నది కొందరిలో కామెర్లు, రక్తహీనత, శరీరానికి సరిపడా ఆక్సిజన్ అందకపోవడం వల్ల కూడా కావచ్చు. నాలుక ఒక పక్కకు వాలిపోతే అది పక్షవాత లక్షణంగా పరిగణిస్తారు.
6. నాలుక వణకడం కనిపిస్తే అది థైరాయిడ్ గ్రంధి అతిగా పనిచేయడం కారణంగా ఉంటుంది. లేదా కొన్ని నరాల వ్యాధుల వల్ల గానీ, మల్టిపుల్ స్ల్రెరోసిన్ సమస్య వల్ల గానీ కావచ్చు. ఇప్పుడర్థమయిందా డాక్టర్ వద్దకు వెళ్లగానే నాలుకు ఎందుకు పరీక్షిస్తారో..

నాలుకను శుభ్రం చేసుకోవడం వల్ల పొందే లాభాలు :
i. నాలుకను శుభ్రం చేసుకోవడం వల్ల రుచి పెరుగుతుంది. రకరకాల రుచులను తెలుపుతుంది. ప్రతి ఒక్కరికీ 10 వేల టేస్ట్‌బడ్స్ ఉంటాయి. ఇవి ప్రతి రెండువారాలకు రీప్లేస్ అవుతూ ఉంటాయి. ఒకవేళ నాలుకను శుభ్రపరుచుకోకుంటే టేస్ట్‌బడ్స్ బ్లాక్ అవుతాయి. దీంతో రుచి తెలియక ఉప్పు, కారం లేని ఆహారం తీసుకుంటారు.
ii. రోజుకు రెండుసార్లు బ్రెష్ చేసి నాలుకను శుభ్రం చేసుకోవడం వల్ల బ్యాక్టీరియాను నాశనం చేసి, దుర్వాసన రాకుండా ఉంటుంది. ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఇలా చేయకుంటే బ్యాక్టీరియా పెరిగిపోయి చిగుళ్ల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. శుభ్రపరుచుకోవడం వల్ల వయసు పెరిగినా పళ్లు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version