మన్యంలో ఏం జరుగుతోంది… టార్గెట్ విశాఖ?

-

ఆంధ్రప్రదేశ్ లో “వైజాగ్” హాట్ టాపిక్ గా మారుతోంది. రాజధానిగా వైజాగ్ చేసేందుకు రెడీ అయిన సమయంలో.. అక్కడ ఒక రకమైన అలజడి వాతావరణాన్ని సృష్టించేందుకు జరుగుతున్న చర్యలుగా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి! అందులో భాగంగా వైజాగ్ కేంద్రంగా జరుగుతున్న ఫ్యాక్టరీలలో ప్రమాధాలు.. తాజాగా మన్యంలో ఎన్ కౌంటర్ పరిణామాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.

సహజంగా వైజాగ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రజలు భిన్నత్వంలో ఏకత్వం సంస్కృతీ సంప్రదాయాలను కలిగి కలిసిమెలిసి కలపుగోలుగా జీవితాన్ని గడుపుతుంటారు. ముఖ్యంగా వైజాగ్ అంటేనే “సిటీ ఆప్ డెస్టినీ” గా పేరుంది. అలాంటి వైజాగ్ లో ఒక్కొక్కటిగా జరుగుతున్న పరిణామాలు రాజధాని అక్కడ వద్దని వారించేవారికి అదోరకమైన ఆనందాన్ని ఇస్తుంది. వైజాగ్ రాజధానిగా వద్దని జప,తపాలను చేస్తున్న కొన్ని పార్టీలు కావాలని చేస్తున్న రచ్చగా ప్రజల్లో కూడా భావన కలుగుతుంది. ముఖ్యంగా ఎల్జీ కంపెనీలో గ్యాస్ లీకేజీ, ఆ తర్వాత తాజాగా మరో కంపెనీలో గ్యాస్ లీజేకీ ఘటన మరింత ఆ ప్రాంతంలో అలజటి సృష్టించేందుకు జరుపుతోన్న పన్నాగంలో భాగంగా తెలుస్తోంది.

అంతేకాకుండా తాజాగా విశాఖ ఏజెన్సీలో మరోసారి మావోల అలజడి రేగింది. పెదబయలు మండలం లండులు అటవీ ప్రాంతంలో సుమారు అరగంటసేపు పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. బొంజంగి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమవుతున్నారనే సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అయితే పోలీసులు కూబింగ్ నిర్వహిస్తున్నారని… మావోలకు ముందస్తుగానే సమాచారం అందింది. దీంతో వారు పోలీసులే లక్ష్యంగా మందు పాతర అమర్చారు. కాగా.. పోలీసులు దాని నుంచి పోలీసులు తృటిలో తప్పించుకున్నారు.

ఈ క్రమంలో పోలీసులు మావోల మధ్య కాల్పులు సంభవించాయి. కాగా కాల్పులలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే ఒడిషా దిశగా జారుకున్నట్లు సమాచారం అందుతుంది. అయితే ఘటనా స్థలంలో 303తుపాకీ, ఆరు కిట్‌ బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా మూడు రోజుల క్రితం ఒడిషా సరిహద్దు వంతలగూడలో కూడా పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఇటువంటి ఘటనలు.. వైజాగ్ కేంద్రంగా జరిగే రాజధాని వ్యతిరేక శక్తులు పన్నుతున్న పన్నాగంలో భాగంగా చోటుచేసుకుంటున్న ఘటనలుగా వీటిని కొందరు అభివర్ణించడం కొసమెరుపు!

Read more RELATED
Recommended to you

Exit mobile version