కనుబొమ్మల మధ్యే బొట్టు ఎందుకు పెట్టుకోవాలో తెలుసా..?

-

పెద్దవాళ్లు చెప్తూ ఉంటారు కనుబొమ్మల మధ్య బొట్టు పెట్టుకొని అలాగే కొంత మంది నుదిటి మీద కూడా బొట్టు పెట్టుకుంటారు. అయితే కనుబొమ్మల మధ్య బొట్టు ఎందుకు పెట్టుకోవాలి..?, దీని వెనుక ఉన్న కారణం ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ప్రాచీన కాలం నుండి కూడా కను బొమ్మల మధ్య బొట్టు పెట్టుకోవడం అనేది సంప్రదాయంగా వస్తోంది.

హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా కనుబొమ్మల మధ్య బొట్టు పెట్టుకుంటే మంచిది. చాలా మంది పెద్ద బొట్టు పెట్టుకుంటారు. దీని వెనుక ఒక పెద్ద కారణం ఉంది. అదే మిటంటే మన కనుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్రం ఉంటుంది.

ఆ ఆజ్ఞాచక్రం ఎప్పుడూ వేడి పుట్టిస్తూ ఉంటుంది. దీంతో ఆ ప్రాంతంలో చల్లదనం ఉండాలనే ఉద్దేశంతో కుంకుమ, పసుపు, భస్మం, చందనం వంటివి పెట్టుకుంటూ ఉండే వారు. దీని వల్ల ముఖానికి అందం తో పాటు తేజస్సు కూడా వస్తుంది.

అలాగే బొట్టు ఎలా అయినా పెట్టుకోవచ్చు. అంటే గుండ్రంగా కానీ నిలువుగా కానీ అడ్డంగా కానీ పెట్టుకోవచ్చు. మీ యొక్క ఆచారాన్ని బట్టి మీరు దీనిని అనుసరించ వచ్చు. అలాగే కొంత మంది బస్మం, కుంకుమ కలిపి పెట్టుకుంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version