వాట్సప్ నుంచీ మరో లేటెస్ట్ ఫీచర్…ఇది నిజంగా సూపర్…!!!

-

ప్రస్తుత టెక్నాలజీ లో దేశవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగిస్తున్న ఏకైక సోషల్ మీడియా సాధనం వాట్సప్. గతంలో ఫేస్ బుక్ లో ఉండిపోయే చాలా మంది ఇప్పుడు వాట్సప్ లో అధిక సమయం వెచ్చిస్తున్నారు. రోజు వారి వ్యాపార , ఉద్యోగ కార్యకలాపాలు సైతం వాట్సప్   నుంచీ సాగుతుండటంతో రోజు రోజుకి వాట్సప్  వాడే వారి సంఖ్య అధికమవుతోంది. ఈ క్రమంలోనే వాట్సప్ కాలానికి తగ్గట్టుగా కొత్త కొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా అందుబాటులోకి రానున్న ఫీచర్ అద్భుతంగా ఉంటుందని అంటునారు టెక్ నిపుణులు.

వాట్సప్ లో మనం పంపే మెసేజ్ లని డెలీట్ చేసుకునే సౌకర్యం ఉంది. ఇప్పటికే ఈ ఫీచర్ ఎంతో మందికి ఉపయోగకరంగా ఉండటంతో పాటు ఆదరణ పొందింది. అయితే త్వరలో రానున్న లేటెస్ట్ ఫీచర్ లో మాత్రం మెసేజ్ చేసిన 5 సెకన్ల నుంచీ గంట వరకూ కనిపిస్తాయి ఆ తరువాత ఆటోమేటిక్ గా డెలీట్ అయిపోతాయి.

 

ఇలాంటి సెట్టింగ్ వాట్సప్ లోకి  త్వరలో రానుంది. అందకుగాను వాట్సప్  లో సెట్టింగ్స్ విభాగంలో అందచేసే డిసప్పియర్ మెసేజ్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఇందులో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుందని  సంస్థ తెలిపింది. ఈ లేటెస్ట్ ఫీచర్ కూడా యూజర్స్ కి ఎంతో నచ్చుతుందని ప్రయోగాత్మకంగా నిర్దారించుకుంది వాట్సప్ . త్వరలో వాట్సప్   యూజర్స్ అందరికి అందుబాటులోకి రానుందని సంస్థ తెలిపింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version