ఏపీ లో పదోతరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల ఎప్పుడంటే?

-

ఏపీలో 10వ తరగతి సప్లిమెంటరీ, బెటర్మెంట్ పరీక్షలను ఇటీవల నిర్వహించిన సంగతి తెలిసిందే.గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువమంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు.అందుకే ఈ ఏడాది బెటర్మెంట్ పరీక్షలను కూడా ప్రభుత్వం నిర్వహించారు.ఈ పరీక్షా ఫలితాల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..అయితే ఈ ఫలితాలను త్వరలోనే విడుదల చేసెందుకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది.

త్వరలోనే ఈ పరీక్షా ఫలితాలకు సంబందించిన ప్రకటన విడుదల కానుంది.ఈ ఏడాది ఈ పరీక్షలకు 2,01,627 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులు AP SSC Supplementary Results వెలువడిన అనంతరం https://bse.ap.gov.in/ వెబ్సైట్ ద్వారా పది ఫలితాలను చెక్ చేసుకొవచ్చు..

గతంలో ఎప్పుడూ లేని విధంగా పదోతరగతి విద్యార్థులకు ఈసారి బెటర్‌ మెంట్‌ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా పదో తరగతి విద్యార్థులకు బెటర్‌మెంట్‌ పరీక్షను రాసే అవకాశం కల్పించారు. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి తక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల కోసం ఈ అవకాశాన్ని కల్పించారు.

ఈమేరకు పరీక్షల విభాగానికి పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 49 అంతకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి రెండు సబ్జెక్టుల్లో బెటర్‌మెంట్‌ రాసుకునేందుకు అవకాశం కల్పించారు. సబ్జెక్టుకు రూ.500 ఫీజుతో పరీక్ష రాసేందుకు వెసులుబాటు కల్పించారు. ఈ ఏడాది పది పరీక్షలు రాసిన వారికి మాత్రమే బెటర్‌మెంట్‌ రాసే అవకాశం ఉందని విద్యాశాఖ స్పష్టం చేసింది..

ఫెయిల్‌ విద్యార్థుల కోసం నిర్వహించే సప్లమెంటరీ పరీక్షలతో పాటు ఈ బెటర్‌ మెంట్ పరీక్షలను నిర్వహించనున్నారు. అయితే ఈ బెటర్‌ మెంట్‌ పరీక్షలు కేవలం ఈ ఏడాదికి మాత్రమే పరిమతం అని విద్యా శాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఏపీలో సప్లమెంటరీ పరీక్షలను జులై 06 నుంచి జులై 15 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే..

Read more RELATED
Recommended to you

Exit mobile version