నేడు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.అయితే, సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో అపశృతి దొర్లింది.
కొబ్బరికాయ కొట్టే విషయంలో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య భేదాభిప్రాయాలు వచ్చి కొట్టుకున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మునగాల మండలం రేపాల గ్రామంలో మంగళవారం ఉదయం వెలుగుచూసింది. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో కొబ్బరికాయ కొట్టే విషయంలో ఇద్దరు నేతల మధ్య ఘర్షణ నెలకొంది. ముందు తాము కొబ్బరికాయ కొట్టి ఫొటోలు దిగుతామని గొడవకు దిగి ఇరు వర్గాలలోని కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకున్నట్లు సమాచారం. ఈ వీడియో వైరల్ అవుతోంది.
సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో కొబ్బరికాయ కొట్టే విషయంలో గొడవ.. కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు
సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మునగాల మండలం రేపాల గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో కొబ్బరికాయ కొట్టే విషయంలో ఘర్షణ
ముందు తాము కొబ్బరికాయ కొట్టి ఫొటోలు దిగుతామని గొడవకు… pic.twitter.com/nOENBz7gP4
— Telugu Scribe (@TeluguScribe) April 1, 2025