సీఎం రేవంత్ రెడ్డికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి జానారెడ్డి ఐఏసీసీకి లేఖ రాసినట్లు తెలుస్తోంది.ఈనెల 3న కేబినెట్ విస్తరణ ఉంటుందని టాక్ వస్తున్న క్రమంలో జానారెడ్డి లేఖ ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో సంచలనానికి తెరలేపింది. ఇప్పటికే ఆశావహుల జాబితాను హైకమాండ్‌కు పంపించినట్లు గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి.
ఈ క్రమంలోనే తమ ప్రాంతం వారికి కూడా ప్రాతినిధ్యం కల్పించాలని హైకమాండ్‌కు కాంగ్రెస్ సీనియర్ లీడర్ జానారెడ్డి రిక్వెస్ట్ చేశారు. కేబినెట్ విస్తరణలో ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంగళవారం ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్‌కు లేఖ రాశారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని లేఖలో కోరినట్లు తెలిసింది. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు ప్రయోజనమే కాకుండా, కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహద పడుతుందని పేర్కొనట్లు వెల్లడైంది.