సిరిసిల్ల రైతుల పట్ల ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ రైతు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘మాకు ఓటు వేస్తేనే నీళ్ళు ఇస్తాం..సస్తే సావండి’ అంటూ ఆదిశ్రీనివాస్ మాట్లాడారని ఓ వృద్ధ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
‘మీరు మాకు ఓటు వేయలేదు, నీళ్ళు ఎందుకు ఇస్తాం, సస్తే సావండి’ అంటూ సిరిసిల్ల రైతులతో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి నిర్లక్ష్యంగా ప్రవర్తించారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్లు ఎవరూ పట్టించుకోవడం లేదని, కేటీఆర్ వచ్చి నీళ్ళు తెచ్చిండు అని రైతులు చెబుతున్నారు.
https://twitter.com/TeluguScribe/status/1897172061820256413