హెచ్‌-1బీ వీసాపై వైట్‌హౌస్‌ క్లారిటీ…లక్ష డాలర్లు కాదంటూ

-

హెచ్‌-1బీ వీసాపై వైట్‌హౌస్‌ క్లారిటీ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెచ్చిన నిబంధనలపై ‘ఎక్స్’ వేదికగా క్లారిటీ ఇచ్చారు వైట్‌హౌస్‌ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లీవిట్. హెచ్‌-1బీ వీసాపై విధించిన లక్ష డాలర్ల రుసుం వార్షిక ఫీజు కాదని స్పష్టం చేసింది.

H-1B visas
White House clarity on H-1B visa

దరఖాస్తు చేసుకునే సమయంలో కట్టాల్సిన వన్ టైమ్ ఫీజు మాత్రమేనని తెలిపారు సెక్రెటరీ. ఇప్పటికే ఈ వీసా కలిగి ఉండి అమెరికా బయట ఉన్నవారు భయపడాల్సిన అవసరం లేదని, వారిపై ఈ లక్ష డాలర్ల రుసుం విధించబోమని వెల్లడించారు. వారంతా ఎప్పటిలాగే అమెరికా నుంచి బయటికి వెళ్లి తిరిగి రావొచ్చని, కొత్త నిబంధన వారికి వర్తించదని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news