‘బింబిసారుడు’ ఎవరూ.. ఏంటా ఆయన చరిత్ర.. కళ్యాణ్ రామ్ కొత్తసినిమా పై ప్రేక్షల్లో ఉత్కంఠ

-

కళ్యాణ్ రామ్ నటిస్తున్న బింబసార పోస్టర్ ఈ మధ్యే రిలీజ్ అయింది. కళ్యాణ్ రామ్ కి ఇది మొదటి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ చిత్రం. టైటిల్ ఆసక్తికరంగా ఉండటంతో ఇప్పుడు దృష్టి అంతా.. ఎవరూ బింబసార అనే దానిమీదే ఉంది. బింబసారగా కళ్యాణ్ రామ్ కనిపిస్తున్నాడంటే..కచ్చింగా రాజు అనే అనుకుంటారు..కాబట్టి ఈరోజు ఈ బింబసార ఎవరూ, ఈయన చరిత్రఏంటో తెలుసుకుందాం.

మగధ సామ్రాజ్యాన్ని పాలించిన రాజు బింబిసారుడు… ఆయనది హర్యాంక వంశం. క్రీస్తు పూర్వం 558లో బింబిసారుడు జన్మించారు. ఆయన భట్టియా అనే అధిపతి కుమారుడు. 15 ఏళ్ల వయసులోనే సింహాసనాన్ని అధిష్ఠించారు . క్రీస్తు పూర్వం 543 నుంచి 492 మధ్య మగధ సామ్రాజ్యాన్ని పాలించారు. మగధ సామ్రాజ్యం మొదటి రాజధాని రాజగృహ అంటే రాజగిరి. ఆ తర్వాత పాటలీపుత్ర ఇప్పుడు పాట్నా రాజధానిగా చేసుకొని వీరు పాలించారు. బిహార్, గంగానది దక్షిణ ప్రాంతాల్లో మగధ సామ్రాజ్యం విస్తరించి ఉండేది. బింబిసారుడు కన్నుపడింది అంటే..ఇక ఏ రాజ్యమైన మగదసామ్రాజ్యంలో కలిసిపోవాల్సిందే. బౌద్ధ మత వ్యవస్థాపకులైన గౌతమ బుద్ధుడు తన జీవితంలో ఎక్కువ కాలం మగధ సామ్రాజ్యంలోనే గడిపారట.

బింబిసారుడు కోసల రాజు మహా కోసల కూతురైన కోసలా దేవిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత లిచ్చావి రాజకుమారి చెల్లన, మద్రా రాజకుమారి క్షేమను వివాహమాడారట. ఈయనకు మొత్తం 500 మంది భార్యలు ఉన్నారని మహావగ్గ వర్ణించారు. మగధ రాజ్య సింహాసనం అధిరోహించడానికి బింబిసారుడి కుమారుడు అజాతశత్రువే ఆయన్ను ఖైదు చేశారు. తనకు మొదటి బిడ్డ పుట్టిన తర్వాత విడుదల చేయాలనుకున్నారు. కానీ అప్పటికే బింబిసారుడు మరణించారు. క్రీ.పూ. 491లో ఇది జరిగింది. 52 సంవత్సరాలు మగధసామ్రాజాన్ని పరిపాలించాడు ఈ బింబిసారుడు.

బింబిసారుడు రాజ్యంలో ఏనుగులు ఎక్కువగా ఉండేవి. యుద్ధానికి కూడా ఈ ఏనుగులను దింపేవారట. వాటికి బాగా శిక్షణ ఇచ్చేవాడట. బింబిసారుడుకి సైనిక బలగం ఎక్కువగా ఉండటంతో…బింబిసారుడు యుద్ధానికి వస్తే పక్క రాజ్యాలు హడలిపోవేవి. ఆశపడిన రాజ్యాన్ని మొదట మాటలతో చర్చించి దక్కించుకోవటం లేదంటే..వారికి కావల్సింది ఇవ్వటం అప్పటికి ఒప్పుకోకుంటే…యుద్దానికి వెళ్లటం బింబిసారుడి స్ట్రాటజీ. తన ప్రజలను మాత్రం ఏం ఇబ్బందిపెట్టేవాడు కాదు..శత్రువులను మాత్రం అసలు వదిలేవాడు కాదు. చరిత్రలో బింబిసారుడికి మంచిపేరు సాధించాడు.

బింబిసారుడు బుద్ధుని సమకాలికుడైనప్పటికీ ఏ మతాన్ని ఆదరించాడనే దానిపై స్పష్టత లేదు. బౌద్ధ, జైన మతాలు
రెండూ ఈయన్ను తమ మతస్థుడిగానే చెప్పుకుంటాయట. ఇది బింబసారుడి చరిత్ర..అంటే ఈ కథ ప్రకారం..సినిమాలో కళ్యాణ్ రామ్ కూడా చనిపోతాడా లేదా..ఎంతవరకు తీస్తారో అనేది చూడాలి. సాధారణంగా తెలుగు సినిమాల్లో హీరో చనిపోవటాన్ని ప్రేక్షకలు హర్షించరు కాబట్టి క్లైమాక్స్ ఏవిధంగా ఉంటుందనేది ఉత్కంఠమే.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version