ఐబి అధికారి హత్య ; తాహీర్ హుస్సేన్ ఇల్లు చూసిన పోలీసులకు మైండ్ బ్లాక్..!

-

దేశ రాజధాని ఢిల్లీ అల్లర్లలో పోలీసులు కీలక ఆధారాలను గుర్తించారు. అల్లర్లకు కారణమైన నిందితులకు సంబంధించిన ఆధారాలను కూడా ఢిల్లీ పోలీసులు సేకరించారు. ముఖ్యంగా ఎవరు అయితే పథక రచించారో వాళ్లకు సంబంధించిన ఆధారాలను పక్కాగా సేకరించారు. ఇక ఐబి అధికారి అంకిత్ శర్మ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్నా ఆప్ మాజీ నేత, తాహిర్ హుస్సేన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

అతనే ఈ హత్య కేసులో ప్రధానంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అతను తన ఇంటినే ఆయుధాగారంగా మార్చాడు అని పోలీసుల విచారణలో వెల్లడైంది. అతని ఇంటిని గుర్తించి సోదా చేసిన అధికారులు ఇంట్లో భారీగా ఆయుధాలను నిల్వ చేసినట్టు గుర్తించారు. ఇంట్లోనే 80 పెట్రోల్ బాంబులు, 478 కత్తులు, కంకర రాళ్ళ గుట్ట, వెయ్యికి పైగా మాస్కులు, కాళీ బీరు సీసాలు తాహీర్ దాచి పెట్టాడని గుర్తించారు.

ఐబి అధికారిని అతని ఇంట్లోనే చంపినట్టు పోలీసులకు పక్కా సమాచారం అందినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ఫూటేజ్ కూడా పోలీసులు సేకరించారు. ఇప్పుడు అతని కోసం వేట కొనసాగుతుంది. త్వరలోనే అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక ప్రస్తుతం అల్లర్లు జరిగిన ఈశాన్య ఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పోలీసుల సహకారంతో ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version