మహేష్ బాబు ని పొగడ్తలతో ముంచేసిన ఆ హీరో ఎవరు …!?

-

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా పరిచయమై… ఎంతో మంది అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఆరడుగుల అందగాడు సూపర్ స్టార్ మహేష్ బాబు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హ్యాండ్సమ్‌ లుక్‌తో పాటు అద్భుతమైన టాలెంట్‌తో టాలీవుడ్‌లోని స్టార్ హీరోలలో ఒకడిగా వెలుగొందుతున్నాడు. ద‌క్షిణాదివారిని ఒక‌ప్పుడు బాలీవుడ్ న‌టీన‌టులు పెద్ద‌గా ప‌ట్టించుకునే వారు కాదు. అయితే ఇప్ప‌డు ప‌రిస్థితులు మారిపోయాయి. ఇక్క‌డి సినిమాలు బాలీవుడ్ సినిమాల‌తో పోటీ ప‌డుతున్నాయి. ఇక్క‌డి హీరో, హీరోయిన్లు బాలీవుడ్ న‌టీన‌టుల కంటే ఎక్కువ క్రేజ్‌ను సంపాదించుకున్నారు.

ఈ క్ర‌మంలో ఇప్పుడు ఇక్క‌డి వారితో కలిసి ప‌నిచేసేందుకు అక్క‌డి వారు ఆస‌క్తిని చూపుతున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తుంటారు మహేష్. సినిమాలకు సమాంతరంగా వ్యాపార ప్రకటనల్లో నటిస్తూ సత్తా చాటుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్‌కు చెందిన ఓ హీరో మహేశ్ బాబుపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇప్పటికే పలు పెద్ద బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన మహేష్.. ప్రముఖ కూల్డ్రింక్ బ్రాండ్ థమ్స్ అప్ కి అంబాసిడర్ అనే విషయం తెలిసిందే . సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ ప్రకటనల కోసం సమయాన్ని కేటాయిస్తున్నారు ఈ స్టార్ హీరోలు. ఇప్పటి వరకు తెలుగులో మహేశ్ బాబు.. హిందీలో రణ్‌వీర్ యాడ్లు చేస్తూ వచ్చారు. అయితే, తొలిసారి వీళ్లిద్దరి కలయికలో ఓ వీడియోను షూట్ చేశారట. ఇందుకోసం వీళ్లిద్దరూ కలిసి కొద్ది రోజులు ట్రావెల్ చేశారు. దీన్ని ప్రస్తావిస్తూ రణ్‌వీర్ తాజాగా తన సోషల్ మీడియాలో మహేశ్ బాబుతో కలిసున్న ఫొటోను షేర్ చేసి …సూప‌ర్‌స్టార్‌ని ఓ రేంజ్‌లో పొగిడేశారు.

నేను ప‌నిచేసిన వారిలో గొప్ప జంటిల్ మ‌న్‌. మా ఇద్ద‌రి సంభాష‌ణ‌లు ఎప్పుడూ గొప్ప‌గా ఉంటాయి. ల‌వ్ అండ్ రెస్పెక్ట్ టు బిగ్ బ్ర‌ద‌ర్ మ‌హేష్ బాబు అని ఓ కామెంట్ పెట్టారు. ఇక మ‌రోవైపు ర‌ణ్‌వీర్‌తో ప‌నిచేయ‌డంపై మ‌హేష్ బాబు కూడా త‌న అనుభ‌వాన్ని సోష‌ల్ మీడియాలో తెలిపారు. నీతో ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని మ‌హేష్ కామెంట్ పెట్టారు. ఈ ఫొటోలో వారిద్ద‌రు ఏదో డీప్‌గా సంభాషిస్తున్న‌ట్లు అర్థ‌మ‌వుతుండ‌గా.. ఆ ఫొటోను ఇరువురి ఫ్యాన్స్ వైర‌ల్ చేస్తున్నారు. కాగా మ‌రోవైపు మ‌హేష్‌ని ర‌ణ్‌వీర్ పొగిడేయడంపై సూప‌ర్ స్టార్ ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. రణ్‌వీర్‌కి థ్యాంక్స్ చెబుతూ వారు కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version