నరేష్, పవిత్ర లోకేష్ లిప్ కిస్ వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఎవరిదంటే..?

-

సినీ ప్రపంచంలో సెలబ్రిటీలు ఏం చేసినా సరే క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో నరేష్ , పవిత్ర లోకేష్ బంధం పై విపరీతమైన చర్చలు, ట్రోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వీరి బంధాన్ని కించపరుస్తూ అవమానించేలా పోస్ట్లు కూడా పెడుతున్నారు. వీళ్ళ బంధాన్ని తప్పుడుగా చూస్తూ వచ్చారు. అయితే తమని తప్పుడు అభిప్రాయంతో చూసేవారికి నరేష్ , పవిత్ర జంట గట్టిగా బదులిచ్చింది.

ఒకే ఒక్క లిప్ కిస్ వీడియోతో తమ గురించి తప్పుడుగా వస్తున్న వార్తలపై, ట్రోలర్స్ కి కూడా గట్టిగా సమాధానం ఇచ్చారు. ఇకపోతే తమ మధ్య ఉన్న సంబంధం పవిత్రమైనది అనేలా వీడియోని కూడా విడుదల చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాము అని ఈ జంట వెల్లడించింది. ఒకే ఒక్క ముద్దుతో వీళ్ళ మధ్య ఉన్న బంధం కూడా అర్థమయిపోయింది. ఇకపై వాళ్ల మీద ఇష్టం వచ్చినట్టు గా వార్తలు రాసే అవకాశం లేకుండా కళ్లెం వేశారు. కావాలనే ఇలా ప్లాన్ చేసి వీడియో రిలీజ్ చేసినట్టు స్పష్టం అవుతోంది.

ఇన్ని రోజులు సరైన సమయం కోసం ఎదురు చూడలేదు కొత్త సంవత్సరంలో.. కలిసి కొత్త జీవితం ప్రారంభించాలని ఫిక్స్ అయ్యి.. ఎన్ని వార్తలు వచ్చినా సహనంగా భరిస్తూ ఇప్పుడు ఓపెన్ అయ్యారు. అయితే ఈ మాస్టర్ ప్లాన్ వెనుక ఆయన సన్నిహితులు ఉన్నట్లు తెలుస్తోంది.కొత్త సంవత్సరం.. కొత్త ప్రారంభంలో మీ అందరి ఆశీస్సులు కావాలంటూ నరేష్ ట్వీట్ చేశారు. మొత్తానికైతే వీరిద్దరూ ఇప్పుడు ఒక ఇంటి వాళ్ళు కాబోతున్నారని సమాచారం. వాళ్ల గురించి వస్తున్న తప్పుడు రాతలు ఆపాలన్నదే ఈ లిప్ కిస్ ఇంటెన్షన్. మొత్తానికైతే ట్రోలర్స్ నోటికి మూత పడిందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version