నల్లగొండ, రంగారెడ్డికి పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్‌ అభ్యర్థులు వారేనా..?

-

కాంగ్రెస్‌ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసినట్లే. నల్లగొండ– ఖమ్మం– వరంగల్‌ జిల్లాల అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ ఎస్‌.రాములు నాయక్, రంగారెడ్డి– హైదరాబాద్‌– మహబూబ్‌నగర్‌ జిల్లాల అభ్యర్థిగా జి.చిన్నారెడ్డిల పేర్లు ఖారారైనట్లు తెలిసంది. నల్లగొండకు ఓయూ విద్యార్థి నాయకుడు కోటూరి మానవతారాయ్, రంగారెడ్డికి చల్లా వంశీచంద్‌ రెడ్డి పేర్లు సైతం అధిష్టానం ముందున్నా సుధీర్ఘంగా చర్చించి చిన్నారెడ్డి, రాములు నాయక్‌ల పేర్లకే మొగ్గు చూపుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఈ వారంలోపే అభ్యర్థులను అధికారికంగా ప్రకటిస్తారని చర్చ జరుగుతోంది.

భారీ కసరత్తు..

అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్‌ భారీ కసరత్తు చేసింది. అందుకు రెండు నెలల ముందుగానే టికెట్‌ ఆశిస్తున్న వారి నుంచి దరఖాçస్తులను స్వీకరించగా నల్లగొండ స్థానానికి 26, రంగారెడ్డికి 24 దరఖాస్తులు వచ్చాయి. వీటంనింటినీ క్షుణ్ణంగా పరిశీలించగా టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, ఇంటి పార్టీ నాయకుడు చెరకు సుధాకర్‌ నల్లగొండ స్థానంలో మద్దతివ్వాలని టీపీసీసీని కోరారు. దీంతో పొత్తులపై నిర్ణయం తీసుకునేందుకు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో టీపీసీసీ ఓ కమిటీని నియమించింది.

అనుభవానికే మొగ్గు..

ఈ రెండు ఎమ్మెల్సీ టికెట్లను కేటాయించేందుకు సామాజిక సమీకరణాలు, అనుభవం అనే ప్రాతిపదికలను కాంగ్రెస్‌ పార్టీ ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. నల్లగొండ– ఖమ్మం–వరంగల్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థిగా రాములునాయక్‌ను కూడా ఇదే కోణంలో ఎంపిక చేసినట్టు గాంధీభవన్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయనకు ఎమ్మెల్సీగా రెండేళ్ల కాలం ఉండగానే కారు దిగి చేతి గూటికి చేరారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీలో ఎప్పటికైనా భవిష్యత్తు ఉంటుందనే సంకేతాలు ఇచ్చినట్టు అవుతుంది. దీంతో పాటు ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఎస్టీ, అందులోనూ లంబాడీ గ్రాడ్యుయేట్లు ఎక్కువగా ఉన్నారు.

వీటన్నింటినీ దష్టిలో పెట్టుకొని రాములునాయక్‌ అభ్యర్థిత్వం వైపు అధిష్ఠానం మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. రంగారెడ్డి– హైదరాబాద్‌– మహబూబ్‌నగర్‌ అభ్యర్థిగా జి.చిన్నారెడ్డిని అనుభవం ప్రాతిపదికన ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈసారి చిన్నారెడ్డికి అవకాశం ఇవ్వాలని టీపీసీసీ పెద్దలు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ టికెట్‌ ఆశించిన మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం గౌడ్, టి.రామ్మోహన్‌ రెడ్డి పోటీ నుంచి తప్పుకోవడం, అధిష్టానం దష్టిలో ఉన్న వంశీ యువకుడు కావడంతో మరోమారు అవకాశం ఇవొచ్చనే ఆలోచన మేరకు దాదాపుగా చిన్నారెడ్డి పేరే ఖరారయ్యే ఆస్కారం ఉంది.

!

Read more RELATED
Recommended to you

Exit mobile version