Big Boss OTT Telugu: ఈ వారం ఎలిమినేట్ అయ్యేదెవరు..‘బిగ్ బాస్’ ఊహించని ట్విస్టు ఇవ్వబోతున్నాడా?

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఓటీటీ వర్షన్ ఎనిమిదో వారంలోకి ఎంటర్ అయింది. ఈ వారం ఎలిమినేషన్ పైన ‘బిగ్ బాస్’ ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కంటెస్టెంట్స్ లో ఈ సారి ఎవరికి ఎక్కువగా చాన్సెస్ ఉన్నాయని బీబీ లవర్స్ చర్చించుకుంటున్నారు. గత వారంలో లాగా ఈ వారం కూడా సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా? లేదా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అయింది.

ఓటింగ్ పరంగా చూస్తే అతి తక్కువ ఓటింగ్ ఈ వారంలో తెచ్చుకున్న అజయ్ నే ఎలిమినేట్ కావాలి. కానీ, బిగ్ బాస్ ఈ ఓటీటీ షో ఎవరూ ఊహించని విధంగా ట్విస్టులు ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు పలువురు రివ్యుయర్స్, బీబీ లవర్స్. అయితే, ఎలిమినేట్ అయ్యే చాన్సెస్ తగ్గించుకోవడం కోసం కంటెస్టెంట్స్ తమ గేమ్ పైన ఫుల్ ఫోకస్ పెడుతున్నారు.

బీబీ లవర్స్ ఊహించుకున్న విధంగా కాకుండా అంతకు మించిన పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు కంటెస్టెంట్స్ అందరూ ట్రై చేస్తు్న్నారు. అయితే, ఇక్కడ సేవింగ్ ఫ్యాక్టర్ అనేది కీలకంగా మారుతున్నది. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన బాబా మాస్టర్ బిందు మాధవిని సేవ్ చేసేశాడు. ఈ నేపథ్యంలో బీబీ కంటెస్టెంట్స్ లో నెక్స్ట్ సేవ్ అయ్యేది ఎవరు అని ఆందోళన ఉంది. తాము ఆ సేవింగ్ లిస్ట్ లో ఉండాలని అనుకుంటున్నారు వాళ్లు. కాగా, బిగ్ బాస్ ఎప్పుడు ఏం చేస్తాడు? అనేది మాత్రం ఇప్పుడే ఏం చెప్పలేం.. చూడాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version