చిట్టిచామంతి ఆయిల్ తో మోకాళ్లనొప్పులు, డిప్రషన్ కు చెక్ పెట్టేయొచ్చంటున్న అధ్యయనాలు

-

మీ అందరికీ చిట్టిచామంతి పువ్వులు తెలిసే ఉంటుంది. పూజలో కూడా ఈ పువ్వులు వాడతారు. అయితే ఈ చిట్టిచామంతి పువ్వుల నుంచి ఆయిల్ తీస్తారు. దీన్నే చామమిలీ ఆయిల్( Chamomile Oil) అంటారు. ఈ ఆయిల్ వాసన పీల్చడం ద్వారా లేదా..ఆ పువ్వుల డికాషన్ తాగడం వల్ల అనేక అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని సైంటిఫిక్ గా నిరూపించారు. ఈరోజు మనం ఈ ఆయిల్ ఏ విధంగా ఉపయోగపడుతుందో పూర్తిగా తెలుసుకుందాం.
ఈ చిట్టిచామంతి ఆయిల్ 10ml రూ. 400-500 ఉంటుంది. అంత ఖరీదో. దీన్ని వాడేప్పుడు మొత్తం ఇదే వాడక్కర్లా.. 1ml ఈ చిట్టిచామంతి ఆయిల్ తీసుకుని 5ml కొబ్బరి నూనె తీసుకుంటే ఆయిల్ డిఫ్యూసర్ లో పోసీ వెలిగిస్తే.. మంచి వాసన వస్తుంది. అది పీలిస్తే.. మెదడులో యాక్సైటీ ఉన్నవారికి బాగా తగ్గిస్తుంది, బాడీలో కార్టిసాల్ ఎఫెక్ట్( Cortisol) ను కంట్రోల్ చేస్తుందని 2019 యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్ వేనియా (University Of Pennsylvania) వారు పరిశోధన చేసి ఇచ్చారు. డిప్రషన్ తో బాధపడేవారికి కూడా ఈ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది వీళ్లు కనుగొన్నారు.
ఈ ఆయిల్ వాసన పీల్చినప్పుడు మెదడులో అనేక రకాల కెమికల్ చేంజెస్ వచ్చి.. కార్టిసాల్ హార్మోన్ తగ్గి, యాక్సైజీ అద్భుతంగా తగ్గుతుంది. ఇంట్లో డిఫ్యూసర్ లేనివాళ్లు.. చిట్టిచామంతి ఆయిల్ కొనుక్కోని దూదితో ముంచి ముక్కు దగ్గర పెట్టుకుని వాసన పీల్చవచ్చు. ఇలా చేసినా సరే 8 వారాల్లోనే మంచి ఫలితం ఉంటుంది. ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా.. అందరికి యాక్సైటీ, స్ట్రస్, డిప్రషన్ ఎక్కువగా ఉంటున్నాయి.
ఇంకా ఈ ఆయిల్ ను డర్మటైటిస్( Dermatitis) , సోరియాసిస్( Psoriasis)తో బాధపడేవారు.. చర్మంపైన ఈ ఆయిల్ ను అప్లై చేసినప్పుడు త్వరగా తగ్గుతుందని..2010వ సంవత్సరంలో కొరియావారు నిరూపించారు. స్కిన్ ఇరిటేషన్, దురదలు కూడా తగ్గుతున్నాయి.
ఈ ఆయిల్ లో ఉండే కెమికల్ కాంపౌండ్స్ Apigenin, Caffeic, Bisabolol ఇనన్నీ కూడా మోకాళ్లనొప్పులు, నడుమునొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్, నెక్ పెయిన్ ఉన్నవారికి.. ఈ ఆయిల్ ను ఆవనూనె లేదా కోకొనట్ ఆయిల్ లో కలిపి అప్లై చేయడం వల్ల మజిల్ రిలాక్సేషన్ బాగా తగ్గుతుందని 2015వ సంవత్సరంలో యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇరాన్ (University Of Medical Sciences- Iran )వారు నిరూపించారు.
ఈ ఆయిల్ బ్రెయిన్ కు ట్రాంకులైజర్ ఎఫెక్ట్( Tranquilizer) ఇవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సరే బానే ఉంది.. కానీ ఆయిల్ మరీ కాస్ట్ ఎక్కువ కదా అనుకుంటున్నారా.. ఆయిల్ కొనలేకపోతే.. ఆ చిట్టిచామంతి పువ్వుల రేకులు తీసుకుని ఆ డికాషన్ తాగొచ్చు.ఇలా తాగడం వల్ల ప్రేగులను రిలాక్స్ చేసి.. డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి, ఇరిటిబుల్ బౌల్ సిండ్రోమ్( IBS) ఉన్న వారికి ఇరిటేషన్ తగ్గించడానికి ఈ డికాషన్ బాగా ఉపయోగపడుతుంది.
ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి అని సైంటిఫిక్ గా నిరూపించారు కాబట్టి మీరు హ్యాపీగా వాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఆయిల్ వాసన.. నిద్రలోకి జారుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈరోజుల్లో.. చాలామంది నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు కూడా ఈ ఆయిల్ వాడుకోవచ్చు.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version