దేశంలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఒక పెద్ద కూటమి ఇండియా అనే పేరుతో పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు సార్లు మీటింగ్ లో పాల్గొన్న కూటమిలోని పార్టీలు .. రేపు మరోసారి ముంబై లో రెండు రోజుల పాటు జరగనున్న సమావేశంలో కీలకమైన అంశాలపై మీద నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఇప్పుడు ఒక కొత్త విషయం దేశ రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఇండియా కూటమి తరపున ఎవరు పీఎం అభ్యర్థిగా ఉండనున్నారు అన్నది.. కానీ ఇప్పటి వరకు తెలుస్తున్న సమాచారం ప్రకారం రాహుల్ గాంధీని కూటమి పీఎం అభ్యర్థిగా అందరూ అనుకునుటున్నారు. కానీ సరికొత్తగా ఆప్ నేతలు ఏమో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను, మరియు TMC నేతలు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని పీఎం అభ్యర్థులుగా ప్రకటించాలని కోరుకుంటున్నారు.