రెండు సీట్ల అంశం తుది నిర్ణయం ఏఐసీసీదే : ఉత్తమ్ కుమార్ రెడ్డి

-

తెలంగాణలో రెండు సీట్ల అంశం పై తుది నిర్ణయం ఏఐసీసీదే అని మాజీ పీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటాం. బీసీల కోసం నల్లగొండ సీటు వదులుకుంటానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  వ్యాఖ్యలపై మాత్రం అంతగా స్పందించలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి.  

టికెట్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అధిష్టానాన్ని కోరినట్టు స్పష్టం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. హుజూరా బాద్ నుంచి తాను, కోదాడ నుంచి తన భార్య పద్మావతి రెడ్డి పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పై వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్ కి కలిసొస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఉప్పెనలో బీఆర్ఎస్ కొట్టుకుపోతుందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ లో ఉద్యోగుల డిమాండ్ మేరకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తాం. తెలంగాణ లో ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక కిలో బియ్యం బిఆరెస్ ప్రభుత్వం ఇస్తుంటే మిగతా 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. తెలంగాణ లో దళిత ముఖ్యమంత్రి, డబుల్ బెడ్రూమ్, 3 లక్షలు అన్నారు, కేజీ టూ పీజీ అమలు చేయలేదు. ముస్లిం లకి 12 శాతం రిజర్వేషన్లు ఏమైంది ? దళిత గిరిజనలకు 3 ఎకరాలు అమలు చేయలేదు అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version