ఏపీలో కొత్తగా జగన్ క్యాబినెట్‌లోకి వచ్చే కాపు వర్గం మంత్రులు ఎవరు? ఇప్పుడున్న వారిలో ఎవరు జగన్ క్యాబినెట్‌లో కొనసాగుతారు? జగన్‌కు కాపు కాసే ఆ మంత్రులు ఎవరు? అనేది ఇప్పుడు ఏపీలో కొత్త చర్చ మొదలైంది..ప్రస్తుతం జగన్ క్యాబినెట్‌లో కాపు వర్గానికి చెందిన మంత్రులు ఐదుగురు ఉన్నారు. పేర్ని నాని, ఆళ్ళ నాని, కన్నబాబు, అవంతి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ.. ఈ ఐదుగురు ప్రస్తుతం జగన్ క్యాబినెట్‌లో ఉన్నారు.. మరి వీరిలో ఎవరు జగన్ క్యాబినెట్‌లో ఉంటారు? ఎవరు పక్కకు తప్పుకుంటారో తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. బొత్స మినహా మిగతవారిని క్యాబినెట్ నుంచి తప్పిస్తారని తెలుస్తోంది. అయితే వారి ప్లేస్‌లో పదవి దక్కించుకోవడం కోసం పలువురు కాపు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. కృష్ణా జిల్లా నుంచి పేర్ని నాని ఉన్న విషయం తెలిసిందే.. ఆయన తప్పుకుంటే.. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను లైన్‌లో ఉన్నారు.
ఇక పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఆళ్ళ నాని ఉన్నారు.. ఆయన క్యాబినెట్ నుంచి తప్పుకుంటే.. అదే జిల్లా నుంచి భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు.. కాపు వర్గానికి చెందిన వారు ఉన్నారు. మరి వీరిలో ఛాన్స్ ఎవరికి వస్తుందో క్లారిటీ లేదు. ఎక్కువ శాతం భీమవరం ఎమ్మెల్యేకు అవకాశం దొరకవచ్చని తెలుస్తోంది.
అటు తూర్పు గోదావరి నుంచి కన్నబాబు ఉన్నారు.. ఈయనని తప్పిస్తే.. అదే జిల్లా నుంచి కాపు వర్గం ఎమ్మెల్యేలు అయిన దాడిశెట్టి రాజా, జక్కంపూడి రాజాలు లైన్‌లో ఉన్నారు. వీరిలో మంత్రి పదవి ఎవరికి ఇస్తారో కూడా క్లారిటీ లేదు. ఇక విశాఖ నుంచి మంత్రి అవంతి శ్రీనివాస్ ఉన్నారు..ఈయనని కూడా మంత్రివర్గం నుంచి సైడ్ చేయడం ఖాయం. ఈయనని తప్పిస్తే విశాఖలో కాపు ఎమ్మెల్యేలు పదవి కోసం చూస్తున్నారు.. ఇటు గుంటూరు నుంచి అంబటి రాంబాబు సైతం పదవి ఆశిస్తున్నారు. మరి చివరికి ఏ కాపు ఎమ్మెల్యేకు పదవి దక్కుతుందో చూడాలి.