సంక్షోభంలో పాకిస్తాన్… పతనం దిశగా ఇమ్రాన్ ఖాన్ సర్కార్

-

ఆర్థిక సమస్యలు, పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్ మరో సంక్షోభం ఎదురైంది. రాజకీయ సంక్షోభంతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పతనం అంచున ఉంది. పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థ దిగజారిందని, విదేశాంగ విధానం కూడా సరిగ్గా లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గతం నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం పాకిస్తాన్ లో ఏ ప్రధాని కూడా తన పూర్తికాలం పదవిలో లేరు. తాజాగా ఇమ్రాన్ ఖాన్ కు కూడా ఇదే ఎదురుకాబోతోంది.

ఇమ్రాన్ ఖాన్ | imran khan

ప్రభుత్వానికి వ్యతరేఖంగా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టడంతో ఏ క్షణమైనా.. ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ కు షాక్ ఇస్తూ… 24 మంది ఎంపీలు, ముగ్గురు మంత్రులు రాజీనామా చేశారు. దీంతో ఇమ్రాన్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. అవిశ్వాసం నెగ్గాలంటే ఇమ్రాన్ ఖాన్ కు 172 ఎంపీల మద్దతు కావాాలి. కానీ ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి మద్దతుగా 155 ఎంపీల మద్దతు మాత్రమే ఉంది. అయితే ఇదంతా ప్రతిపక్షాలు, పాక్ ఆర్మీ కావాల్సి చేస్తున్న వ్యూహంగా రాజకీయ నిపుణులు అంటున్నారు. పాక్ ఆర్మీలో ఐఎస్ఐ చీఫ్ నియామకంలో తన సొంత మార్క్ ఉండాలని తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని ఇమ్రాన్ ఖాన్ నియమించారు. ఇది సైన్యానికి రుచించడం లేదు. దీంతో సైన్యం, ప్రతిపక్షాల మద్దతుతో ఇమ్రాన్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సిద్ధం అయినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version