ఈ ‘వైట్’ ఛాలెంజ్ ఏంటి భయ్యా…ఎవరు బుక్ అవుతారు?

-

తెలంగాణ రాజకీయాల్లో మరో సరికొత్త ఛాలెంజ్ వచ్చిది. ఇంతకాలం టి‌ఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు…గ్రీన్ ఛాలెంజ్ పేరిట…దేశ వ్యాప్తంగా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల చేత మొక్కలు నాటించే కార్యక్రమం చేసిన విషయం తెలిసిందే. ఒక సెలబ్రిటీ…మరో ఇద్దరుకు ఛాలెంజ్ విసురుతూ…గ్రీన్ ఛాలెంజ్ ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం చేశారు. అయితే గ్రీన్ ఛాలెంజ్‌లాగానే ఇప్పుడు వైట్ ఛాలెంజ్ ఒకటి తెరపైకి వచ్చింది.

రేవంత్ రెడ్డి కేటీఆర్ | Revanth Reddy KTR

ఇటీవల తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ అంశం తీవ్రంగా కుదిపేస్తున్న విషయం తెలిసిందే. చాలామంది సెలబ్రిటీలు డ్రగ్స్ వాడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. అలాగే ఈ మధ్య వరుసపెట్టి సెలబ్రిటీలు ఈడీ విచారణకు హాజరయ్యారు.  అసలు సెలబ్రిటీలకు అండగా ఉండేది మంత్రి కే‌టి‌ఆర్ అని టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అలాగే కే‌టి‌ఆర్ కూడా డ్రగ్స్ వాడుతున్నారని ఆరోపణలు గుప్పించారు.

ఈ క్రమంలోనే కే‌టి‌ఆర్…ఈ ఆరోపణలపై స్పందిస్తూ…తాను డ్రగ్స్ టెస్ట్‌లో భాగంగా రక్తం, తల వెంట్రుకల శాంపిల్స్‌ను డాక్టర్లకు ఇస్తానని, రాహుల్ గాంధీ కూడా ఇవ్వాలని ఛాలెంజ్ చేశారు. దీనిపై రేవంత్ స్పందిస్తూ… రాష్ట్రంలో  డ్రగ్స్ నిర్మూలన కోసం వైట్ ఛాలెంజ్ ప్రకటిస్తున్నాని, అందుకు తన బ్లడ్, వెంట్రుకల శాంపిల్స్‌ను డాక్టర్లకు ఇస్తానని రేవంత్ అన్నారు. అలాగే ఈ ఛాలెంజ్‌ని మంత్రి కే‌టి‌ఆర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిలకు విసిరారు. వారు కూడా ఇలాగే చేసి మరో ఇద్దరికి ఛాలెంజ్ విసరాలని, అలా రాష్ట్రంలో ఏ ప్రజా ప్రతినిధి కూడా డ్రగ్స్ వాడటం లేదని నిరూపించుకోవాలని రేవంత్ మాట్లాడారు.

అయితే గ్రీన్ ఛాలెంజ్ మాదిరిగా ఈ వైట్ ఛాలెంజ్‌లో ఏ సినీ, రాజకీయ ప్రముఖుడు పాల్గొనరని, ఈ ఛాలెంజ్ స్వీకరిస్తే ఎవరోకరు ఖచ్చితంగా బుక్ అయిపోతారని సామాన్య ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఈ వైట్ ఛాలెంజ్‌ స్వీకరించి ఎవరు బుక్ అవ్వాలని అనుకుంటారని గుసగుసలాడుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version