కమలంలో ‘కథానాయకుడు’ ఎక్కడ?

-

అవును ఇప్పుడు కమలం పార్టీకి ఒక కథానాయకుడు కావాలి…కేసీఆర్ లాంటి రాజకీయ శక్తిని ఎదురుకోవాలంటే…ఆయనకు ధీటైన నాయకుడు ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి కావాలి. ఉండటానికి నాయకులు చాలామంది ఉన్నారు..కానీ వారెవరూ కేసీఆర్‌కు ధీటైన నాయకులు అనిపించడం లేదు. ఇప్పుడు కమలంలో ఉన్న నాయకులంతా కేసీఆర్‌ కెపాసిటీకి సరిపోవట్లేదని చెప్పొచ్చు.

మామూలుగా కమలంలో ఉన్న ప్రతి నాయకుడు..కేసీఆర్‌పై పోరాడుతున్నారు..కానీ ఆయనకు ధీటుగా నిలబడే చెక్ పెట్టే సామర్థ్యం ఉన్న నాయకుడు కనిపించడం లేదు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్…తనకు సాధ్యమైన మేర కేసీఆర్‌ని నిలువరించడానికి చూస్తున్నారు గాని…బండి కెపాసిటీ పూర్తిగా సరిపోవడం లేదని చెప్పొచ్చు. పైగా ఇటీవల కేసీఆర్ మరింత దూకుడుతో రాజకీయం చేయడం మొదలుపెట్టారు…అసలు తనదైన శైలిలో జూలు విదిలించి…పోలిటికల్ గేమ్ స్టార్ట్ చేశారు…ఏకంగా మోదీనే టార్గెట్ చేసి ముందుకెళుతున్నారు. అలాగే రాష్ట్రంలోనే కాకుండా, కేంద్రంలో కూడా బీజేపీకి చెక్ పెట్టేయాలనే ఎత్తుగడతో కేసీఆర్ పనిచేస్తున్నారు.

అంటే ఇలా ఒక్కసారిగా కేసీఆర్ ఎటాక్ మొదలుపెట్టడంతో, ఆయనకు చెక్ పెట్టే కెపాసిటీ గల నాయకుడు తెలంగాణ బీజేపీలో కనబడటం లేదు. అంటే కేసీఆర్‌కు సమవుజ్జి కావాలి…బీజేపీలో కేసీఆర్‌తో సమవుజ్జిగా నిలిచే నాయకుడు ఎవరు అనేది క్లారిటీ లేదు. వాస్తవానికి కిషన్ రెడ్డి, ఈటల రాజేంద్ర లాంటి నేతలు కేసీఆర్‌తో ఢీకొట్టే సామర్థ్యం ఉన్న నేతలే…కానీ ఎందుకో వారు అంత దూకుడుగా రాజకీయం చేయడం లేదు.

బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లాంటి నాయకులే దూకుడుగా ముందుకెళుతున్నారు….ఢీ అంటే ఢీ అనేలా పనిచేస్తున్నారు..అయితే వీరి కెపాసిటీ కేటీఆర్, హరీష్ రావు లాంటి నేతలతోనే సరిపోతుందని చెప్పొచ్చు…కేసీఆర్‌కు మాత్రం చెక్ పెట్టే విషయంలో ఇద్దరు నేతలు సరిపోరు. మరి అలాంటప్పుడు బీజేపీలో ఒక బలమైన శక్తి కావాలి…కేసీఆర్‌తో సమానంగా రాజకీయ వ్యూహాలు పన్నుతూ రాజకీయం చేసే నాయకుడు కావాలి. మరి అలాంటి నాయకుడు బీజేపీకి ఉంటేనే..కేసీఆర్‌కు చెక్ పెట్టగలరు.

Read more RELATED
Recommended to you

Exit mobile version