0జీవితంలో ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది.. అంటారు.. అది సామెత.. అలాగే ప్రతి మనిషికి కూడా తనదైన టైం వస్తుంది. అయితే ఈ విషయంలో దెయ్యాలు కూడా ఏమీ తీసిపోలేదు లెండి. వాటికి కూడా ఒక టైముంది. అది రాత్రి 3 గంటలకు.. అవును.. దాన్నే డెవిల్స్ అవర్ (దెయ్యాల సమయం) అంటారు. రాత్రి 3 నుంచి 4 మధ్య సమయం అస్సలు మంచిది కాదని చెబుతారు.
అంతా బాగానే ఉంది కానీ.. అసలు ఆ సమయాన్ని డెవిల్స్ అవర్ (Devil’s Hour) అని పిలవడానికి గల కారణమేమిటో తెలుసా..? దీనికి కొందరు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. అవేమిటంటే…
* సాధారణంగా సూర్యుడు ఉదయించడానికి కొద్ది గంటల ముందు.. అంటే.. రాత్రి 3 గంటల సమయంలో క్షుద్ర శక్తుల పవర్ ఎక్కువగా ఉంటుందట. అందుకనే కొన్ని వర్గాలకు చెందిన వారు ఆ సమయాన్ని డెవిల్స్ అవర్‌గా పిలుస్తారు.
* ఏసుక్రీస్తును మధ్యాహ్నం 3 గంటలకు శిలువ వేశారు. అందుకు సరిగ్గా 12 గంటల తరువాత.. అంటే రాత్రి 3 గంటలకు క్షుద్ర శక్తుల ప్రభావం ఎక్కువగా ఏర్పడిందట. అందుకనే ఆ సమయాన్ని డెవిల్స్ అవర్‌గా పిలుస్తున్నారు.
* రాత్రి పూట 3 గంటలకు అంటే.. సహజంగానే 99 శాతం మంది ఆ సమయంలో నిద్రిస్తుంటారు. ఇక ఆ సమయంలో క్షుద్ర పూజలు చేసేవారికి అనువుగా ఉంటుందట. అందుకనే ఆ సమయంలో దెయ్యాలను ఆవాహన చేసుకోవడం సులభమవుతుందని వారు భావిస్తారట. దీంతో ఆ సమయాన్ని డెవిల్స్ అవర్‌గా పిలుస్తూ వస్తున్నారు.
ఇక రాత్రి పూట 3 గంటలకు మెలకువ రావడం ఏమాత్రం మంచిది కాదట. ఆ సమయంలో మెలకువ వచ్చినా.. వెంటనే నిద్రపోవాలట. కాగా The Conjuring, The Exorcism of Emily Rose వంటి హాలీవుడ్ మూవీల్లో రాత్రి 3 గంటలను అశుభ సూచకంగా చూపించారు. ఈ మూవీల్లో ఇండ్లలో ఉండే గడియారాలు కూడా రాత్రి పూట 3 గంటలకు పనిచేయడం మానేస్తాయి. ఇలా ప్రతి రోజూ జరుగుతుంది. దీంతో తమ ఇండ్లలో దెయ్యాలు ఉన్నాయని వారు భావిస్తారు. అయితే ఇవన్నీ అక్కడా ఇక్కడా అనుకునే విషయాలే. వీటిని శాస్త్రీయంగా ఎవరూ ఇప్పటి వరకు నిరూపించలేదు. ఇక రాత్రి పూట 3 గంటల సమయంలో మన శరీరం పూర్తిగా విశ్రాంతి తీసుకునే దశలో ఉంటుంది. కానీ కొందరికి ఆ సమయంలో గుండె అసాధారణ రీతిలో కొట్టుకుంటుంది. దాంతో కొందరు సడెన్‌గా నిద్రలేస్తారు. వారిలో కంగారు పెరుగుతుంది. అందుకు భయపడాల్సిన పనిలేదు..!