జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజుని బాలల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు..?

-

దేశవ్యాప్తంగా బాలల దినోత్సవాన్ని నవంబరు 14వ తేదీన జరుపుకుంటారు. ఈ రోజున పాఠశాలల్లో బాలలందరూ జవహర్ లాల్ నెహ్రూ వేషధారణలో కనిపించి ఆకట్టుకుంటారు. తెల్లని కుర్తా ధరించి, జేబుకి ఎర్రగులాబీ పెట్టుకుని అందంగా తయారై తమ పాఠశాలల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకి హాజరవుతుంటారు. బాలల దినోత్సవం వచ్చిందటే పిల్లల్లో హుషారు ఉరకలేస్తుంది. ఐతే చాచా నెహ్రుగా పిలుచుకునే జవహర్ లాల్ నెహ్రూ గారి పుట్టినరోజున బాలల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో ఇక్కడ తెలుసుకుందాం.

స్వాత్రంత్య్ర్య ఉద్యమంలో పాల్గొని స్వాతంత్ర్య భారతావనికి మొదటి ప్రధానమంత్రిగా పనిచేసిన నెహ్రూగారికి బాలలంటే మక్కువ ఎక్కువ. నెహ్రూ గారు పిల్లలని చాలా నమ్మేవారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ఆసక్తి చూపేవారు. నేటి బాలలే రేపటి పౌరులు అని నమ్మిన జవహర్ లాల్ గారు, భారత దేశ భవిష్యత్తు పిల్లల్లోనే దాగి ఉందని చెప్పారు.

దేశంలోని ప్రముఖ విద్యాలయాలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తదితర స్థాపనలో నెహ్రూగారు కీలక పాత్ర పోషించారు. పిల్లల చదువుకు కావాల్సిన అన్నింటినీ సమకూర్చాలని తపనపడ్డారు.

ఐతే నిజానికి అంతర్జాతీయ బాలల దినోత్సవం నవంబరు 20వ తేదీజ జరుపుకునేవారు. నెహ్రూగారు జీవించి ఉన్నప్పుడు ఆ తేదీనే బాలల దినోత్సవాన్ని జరిపేవారు. కానీ నెహ్రూ గారి మరణాంతరం జాతీయ బాలల దినోత్సవాన్ని ఆయన పిల్లలపై చూపిన మక్కువకి నిదర్శనంగా నెహ్రూ గారి పుట్టినరోజైన నవంబరు 14వ తేదీన జరుపుకోవాలని నిర్ణయించారు.

బాలల దినోత్సవం రోజున తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాల్లో కొన్ని..
బాలల హక్కులు.
పిల్లల సంరక్షణ.
పిల్లలందరినీ నాణ్యమైన విద్య.

Read more RELATED
Recommended to you

Exit mobile version