ఇలియానా ఏంటీ మరీ ఇలా తయారైంది…?

-

తెలుగులో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో ఇలియానా ఒకరు. ఈ గోవా బ్యూటి స్టార్ హీరోలు అందరితోను తెలుగులో సినిమాలు చేసింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రవి తేజా, మహేష్ బాబు, రామ్, అల్లు అర్జున్, రానాతో టాలివుడ్ లో సినిమాలు చేసింది. దీనితో తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ని కూడా సంపాదించుకుంది. అయితే తెలుగులో అనూహ్యంగా కనుమరుగు అయిపోయింది.

ఆ తర్వాత బాలివుడ్ లో కూడా సందడి చెయ్యాలని చూసింది గాని పెద్దగా ఆమెకు కలిసి రాలేదు. ఇప్పుడు బాలివుడ్ లో ఒక సినిమా చేస్తుంది. ఈ సినిమా అయినా సరే తనకు కలిసి రావాలని భావిస్తుంది. ఎలా అయినా సరే ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్ళీ ఫాం లోకి రావాలని పట్టుదలగా ఉంది. అందుకే జాగ్రత్తగా వ్యవహరిస్తుంది ఇలియానా. అవకాశాలు రాక ఇబ్బందులు పడుతూ వచ్చింది.

ఆత్మహత్య వరకూ వెళ్లి బయటకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఫాం లోకి రావడానికి నానా తంటాలు పడుతుంది. ఫిజిక్ మీద దృష్టి పెట్టి స్లిమ్ కూడా అయిపోయింది ఇలియానా. తాజాగా తను హాట్ గా ఉండే ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో స్లిమ్ గా కనపడుతుంది. మొన్నా మధ్య ఒక ఫోటో బయటకు రాగా అందులో బొద్దుగా కనపడి కలర్ కూడా మారిపోయింది ఇలియానా. ఇప్పుడు ఈ ఫోటోలు చూసి ఆమె ఫాన్స్ ఖుషీ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version