లగచర్ల ఘటన పై ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం ఇలాకాలో గిరిజనులపై జరిగిన దౌర్జన్యాలపై నోరెందుకు మెదపట్లేదు. ఇళ్లన్నీ తగలబడిపోయి.. ఊచకోత జరిగే దాకా వేచి చూడాలనుకుంటున్నారా..? రాజ్యాంగ పరిరక్షకులమని చెప్పుకునే రాహుల్ గాంధీ.. ఈ దారుణాలపై వెంటనే స్పందించాలన్నారు.
రాహుల్ మీ పార్టీ ముఖ్యమంత్రిని నియంత్రించే పరిస్థితి లేదా..? తెలంగాణలో ఏం జరగుతుందో దేశానికి తెలియాలి. సీఎం నియోజకవర్గంలో జరుగుతున్న దమమకాండ పై స్పందించాలి. పార్లమెంట్ లో లగచర్ల అంశాన్ని లేవనెత్తుతామన్నారు. విధ్వంసం జరిగితేనే స్పందిస్తారా..? పేద, గిరిజనుల బాధ రాహుల్ గాంధీకి కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఏం జరుగుతుందో తెలియనట్టు బీజేపీ డ్రామాలు ఆడుతుందన్నారు. కేంద్రం దీనిపై స్పందిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఫోర్త్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని పేర్కొన్నారు. దాదాపు తొమ్మిది నెలలుగా లగచర్ల రైతులు పోరాడుతున్నారు.