ఉల్లిపాయల్ని కోసేటప్పుడు కళ్ళ నుండి నీళ్లు ఎందుకు వస్తాయంటే…?

-

ఉల్లిపాయలు కోయడం నిజంగా కష్టమైన టాస్క్. ఉల్లిపాయలు కోస్తుంటే కళ్ళంట నీళ్ళు వస్తూ ఉంటాయి. అయితే ఎందుకు ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళంట నీళ్ళు వస్తాయి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళలో నుండి నీళ్ళు రావడానికి ప్రధాన కారణం ఉల్లిపాయలో ఉండే రసాయనం. దీనిని సిన్-ప్రొపాంథైల్-ఎస్-ఆక్సైడ్ అని అంటారు.

 

ఈ రసాయనం ఉల్లిపాయలలో ఉండడం వల్ల మనం వాటిని కోసేటప్పుడు కళ్ళ నుంచి నీళ్లు వస్తాయి. ఈ రసాయనం కళ్ళలో వుండే లాక్రిమల్ గ్రంథిని ప్రేరేపించడం జరుగుతుంది. దీనితో నీళ్ళు రావడం మొదలవుతాయి. అయితే ఉల్లిపాయలు కోసేటప్పుడు మన కళ్ల నుండి నీళ్లు రాకుండా ఉండాలంటే కోసేటప్పుడు పదునైన కత్తిని ఉపయోగించాలి అని అంటున్నారు చెఫ్స్.

కఠినమైన కత్తులతో పోలిస్తే పదునైన కత్తులు అతి తక్కువ కన్నీళ్లను తీసుకొస్తాయి. అలానే కళ్ల నుంచి నీళ్లు రాకుండా ఉండాలంటే ఉల్లిపాయ దిగువ భాగాన్ని కత్తిరించండి. 15 నుండి 20 నిమిషాల పాటు నానబెట్టి ఆ తర్వాత కట్ చేస్తే కూడా కన్నీళ్లు తగ్గుతాయి. కాబట్టి కళ్ళ నుంచి నీళ్లు రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి దీంతో కాస్త సులభంగా కట్ చేయవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version