వాస్తవాలను ప్రభుత్వం ఎందుకు దాస్తోంది : కేటీఆర్

-

తెలంగాణలో వైద్య,ఆరోగ్య పరిస్థితిపై అధ్యయనం చేయడానికి నిపుణులైన డాక్టర్లతో త్రిసభ్య కమిటీ వేసినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా సోమవారం ఆయన స్పందిస్తూ.. మాజీ ఆరోగ్య మంత్రి డాక్టర్ రాజయ్య, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో నిజనిర్ధారణ బృందాన్ని బీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిందన్నారు.అయితే, వారిని గాంధీ హాస్పటల్‌కు వెళ్లనివ్వకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నించారు.

వాస్తవాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు తెలియకుండా ఎందుకు దాస్తోందని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా నిజాలను దాచలేరన్నారు. వాస్తవాలను బయట పెట్టేంతవరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని కేటీఆర్ మరోసారి స్పష్టంచేశారు. ఇదిలాఉండగా, గాంధీలో ఒకే నెలలో 48 మంది శిశువులు, 14 మంది బాలింతలు చనిపోయారని బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తోంది. దీంతో బీఆర్ఎస్ కమిటీని ఏర్పాటు చేయగా..ఆ కమిటీ నేతలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేసినట్లు పార్టీ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version