రాత్రిపూట గోర్లు ఎందుకు కట్ చెయ్యకూడదు.. కారణం ఇదే..!

-

రాత్రిపూట గోళ్ళని కత్తిరించకూడదని పెద్దలు అంటారు. ఎప్పుడైనా మీకు ఈ సందేహం కలిగిందా..? ఎందుకు రాత్రి పూట మనం గోళ్ళని కత్తిరించుకోకూడదు అని… మరి దాని వెనుక పెద్ద కారణమే ఉంది. అదే ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వకాలం నుండి కూడా రాత్రి పూట గోళ్ళని కత్తిరించుకోకూడదు అని చెప్పేవారు. అలా కత్తిరించుకుంటే మంచిది కాదని దాని వలన సమస్యలను ఎదుర్కోవాలని అంటూ ఉంటారు. స్నానం చేసిన తర్వాత గోళ్ళని కత్తిరించుకోవడానికి మంచి సమయం.

 

ఎందుకంటే అప్పుడు గోళ్లు మృదువుగా మారతాయి దాంతో కత్తిరించుకోవడం ఈజీగా ఉంటుంది తేమ ఉంటుంది కాబట్టి ఈజీగా కత్తిరించబడతాయి. కాబట్టి స్నానం అయిన తర్వాత గోళ్లు ని కత్తిరించుకోవడానికి మంచి సమయం. అయితే పాత రోజుల్లో నెయిల్ కట్టర్లు ఉండేవి కాదు ఆ రోజుల్లో కత్తి తో కానీ పదునైన వాటితో కానీ గోళ్ళని కత్తిరించేవారు పైగా అప్పట్లో కరెంటు కూడా ఉండేది కాదు కరెంట్ లేనప్పుడు ఇలా పదునైన వాటితో గోళ్ళని కత్తిరిస్తే ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది అందుకని అప్పట్లో రాత్రిపూట గోళ్ళని కత్తిరించకూడదని చెప్పేవారు.

అలానే రాత్రిపూట గోళ్లుని కత్తిరించేటప్పుడు గోళ్లు అన్నంలో వాటిల్లో పడే అవకాశం కూడా ఉంటుంది. దాంతో ఇబ్బంది కలుగుతుందని పెద్దలు అప్పట్లో రాత్రిపూట గోళ్ళని కత్తిరించద్దు అని చెప్పేవారు గోళ్ళని కత్తిరించే ముందు నీళ్లలో కానీ కొంచెం నూనెలో కానీ గోళ్ళని నానబెట్టి ఆ తర్వాత మృదువుగా మారిన తర్వాత కత్రించడం మంచిది. అలానే గోళ్ళని కత్తిరించుకున్న తర్వాత శుభ్రంగా చేతుల్ని కడుక్కోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version