గణేశ్ మండపాలకు చలాన్లు ఎందుకు కట్టాలి.. ఏపీ హోంమంత్రి వ్యాఖ్యలపై మాధవీలత ఫైర్!

-

ఏపీ హోంమంత్రి వినాయక చవితి పండుగ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం విమర్శలకు దారితీస్తున్నాయి. అతిపెద్ద హిందూవుల పండుగ అయిన వినాయక చవితి రోజున ఆమె ప్రభుత్వ గల్లాపెట్టే నింపుకునేందుకు ప్లాన్ వేశారని సోషల్ మీడియా వేదికగా హిందువులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఎవరి పండుగలకు పన్నులు వసూలు చేయనప్పుడు హిందూ పండుగలకే ఎందుకు వేస్తున్నారు? మేము కట్టాలని నిలదీస్తున్నారు. తాజాగా బీజేపీ నాయకురాలు మాధవీ లత సైతం ఏపీ హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

వినాయక చవితి సందర్భంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసే మండపాలు, ఎత్తైన గణపతి విగ్రహాలకు చలాన్లు చెల్లించాలని ఏపీ హోంమంత్రి అనిత వ్యాఖ్యలపై హీరోయిన్, బీజేపీ నేత మాధవీలత ఫైర్ అయ్యారు. ‘అనితక్కా.. ఏంది ని తిక్క. ఈ కూటమిలో మా పార్టీ ఉన్నప్పటికీ తప్పును ఖండిస్తున్నా. ప్రతివాళ్లకు హిందూ పండుగలపై పడి ఏడువడం తప్పా పనిలేదా? మైక్ పర్మిషన్‌కు రూ.100, విగ్రహాలకు రూ.350 ఇవ్వాలా? ఇదే రూల్ క్రిస్టియన్లకు,ముస్లింలకు పెట్టండి’ ఆమె తీవ్రంగా ఫైర్ అయ్యారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version