తిరుమల శ్రీవారి దర్శనానికి 8 గంటల టైం..!

-

ఇల వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచిచూస్తున్నారు.ఓ వైపు ఏపీలో భారీ వర్షాలు కొనసాగుతున్న స్వామి వారి దర్శనం కోసం తిరుపతికి భక్తులు తరలి వెళ్తున్నారు. కొండపైన భక్తుల కోసం అన్ని ఏర్పాట్లను చేసినట్లు అధికారులు చెబుతున్నారు.గత రాత్రి నుంచి భక్తులు స్వామి వారి దర్వనార్ధం కంపార్ట్మెంట్లలో వేచిచూస్తున్నారని సమాచారం.

ప్రస్తుతం తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇదిలాఉండగా, శనివారం ఒక్కరోజే స్వామివారిని 83,960 మంది భక్తులు దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.2.96 కోట్లు సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.
వర్షాలు కాస్త తగ్గుముఖం పడితే రానున్న రోజుల్లో తిరుపతిలో భక్తుల రద్దీ మరింత పెరిగే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version