హీరోలు ఎందుకు రావాలి.. ఎందుకు దండం పెట్టాలి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

-

మెగా పవర్ స్టార్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతికి వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.దీనికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు గత ప్రభుత్వంలో వైసీపీ అధినేత, మాజీ సీఎంను,ఇటు తెలంగాణ సీఎం రేవంత్‌ను ఉద్దేశించి చేసినట్లుగా ఉన్నాయని నెట్టింట చర్చ జరుగుతోంది.

‘కొత్త సినిమా విడుదలయ్యే ప్రతిసారీ సినిమా టికెట్ల పెంపు కోసం పెద్దహీరోలు సీఎంలకు ఎందుకు దండం పెట్టాలి. కావాలంటే నిర్మాతలతో మాట్లాడండి. హీరోలు వచ్చి నమస్కారం పెట్టాలి అనుకునేంత లోలెవెల్ వ్యక్తులం మేము కాదు.ఇది స్వర్గీయ నందమూరి ఎన్టీఆర్ గారి దగ్గర నుండి నేర్చుకున్నాం’ అని పవన్ చేసిన వ్యాఖ్యలు తాజా రాజకీయ పరిస్థితులకు అద్ధం పడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news