టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కు మరోసారి బిగ్ షాక్ తగిలింది. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కు రాంగోపాల్ పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీ తేజ ను పరామర్శించడానికి వెళ్తాను అంటున్నారట అల్లు అర్జున్.
అయితే… హాస్పిటల్ రావొద్దని.. ఒకవేళ వస్తే అక్కడ జరిగే పరిణామాలకు పూర్తి భాధ్యత వహించాలని పోలీసులు నోటీసులు ఇచ్చారట. అల్లు అర్జున్ ఇంకా నిద్ర లేయలేదని చెప్పడంతో.. మేనేజర్ కు నోటీసులు ఇచ్చారట పోలీసులు. ఎక్కడికి పోవడానికి కూడా లేదు.. కోర్టు పర్మిట్ ఇస్తే తప్పా.. అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్లకూడదని పోలీసులు చెబుతున్నారు. దీంతో మరోసారి టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ హాట్ టాపిక్ అయింది.