బక్రీద్ రోజు ఖుర్బానీని ఎందుకు దానం చేయాలి..? దాని వెనుక ఆంతర్యం ఏంటి..?

-

త్యాగాల పండుగ బక్రీద్‌ను ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈరోజున వివిధ రకాల మాంసాహార వంటకాలతో విందు ఉంటుంది. ముస్లింలు జరుపుకునే అతిపెద్ద పండుగ ఇది. బక్రీద్ ఎప్పుడు, ఖుర్బానీ ఎందుకు చేస్తారు ఇలాంటి విషయాలన్నీ ఓ పాలి చూద్దామా..!

ఇది ఇస్లామిక్ క్యాలెండర్‌లో పన్నెండవ నెల అయిన జుల్ హిజ్జా/ ధుల్-హిజ్జా నెలలోని పదవ రోజున జరుకుంటారు. దీనికి ఒక రోజు ముందు అంటే తొమ్మిదవ రోజును అరఫా దినంగా, అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. ఈ ఏడాది భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లోని ముస్లింలు జూన్ 28వ తేదీన సాయంత్రం అరఫాత్ దినంగా జరుపుకుంటారు. హజ్ కీలక ఆచారమైన అరాఫత్ దినం తర్వాత ఈద్-ఉల్-అదాను జరుపుకుంటారు. అనగా భారతదేశంలోని ముస్లింలు జూన్ 29, 2023న గురువారం రోజున ఈద్-ఉల్-అదా/ బక్రీద్ పండుగను జరుపుకుంటారు.

బక్రీద్ ప్రాముఖ్యత

మత గ్రంథాల ప్రకారం సమాజ హితం కోసం, అల్లా ఆజ్ఞ మేరకు మహ్మద్ ప్రవక్త తన కుమారుల్లో ఒకరిని త్యాగం చేయడానికి సిద్ధపడతారు. ఆ త్యాగాన్ని స్మరిస్తూ ఈద్- అల్- అదా జరుపుకుంటారు. అయితే, ముస్లిం ప్రవక్త ఇబ్రహీం తన కుమారుడిని త్యాగం చేయడానికి సిద్ధమైనప్పుడు, అల్లా జోక్యం చేసుకుంటాడు. అతని కొడుకు స్థానంలో బలి ఇవ్వడానికి ప్రత్యామ్నాయాన్ని మార్గాన్ని అందిస్తాడు. దీంతో అతని కొడుకు ప్రాణాలతో తిరిగి వస్తాడు. అల్లాపై విశ్వాసం, నమ్మకం ఉంచితే అల్లా కాపాడుతాడు అని చెప్పటానికి ఇది ప్రతీక.

ఖుర్బానీ చేయడం ఇందుకే

ఈ నేపథ్యంలో బక్రీద్ నాడు మేకలు లేదా గొర్రెల వంటి జంతువులను బలి ఇవ్వడం ప్రతీతి. అందుకే ఇది బక్రా ఈద్ అయింది. జంతువును బలి ఇవ్వడం అనేది బక్రీద్ పండుగలో కీలకం. దీనినే ఖుర్బానీ చేయడం అంటారు. ఖుర్బానీ చేయడం ద్వారా ఆ త్యాగాన్ని స్మరించుకుంటారు. బలి ఇచ్చిన జంతువు నుండి మాంసాన్ని మూడు భాగాలుగా విభజిస్తారు. అందులో ఒక వంతు తమ కోసం ఉంచుకుంటారు, రెండో వంతును బంధువులు, స్నేహితులకు పంచుతారు, ఇక మూడవ వంతును పంచుతారు. ఇలా ఖుర్బానీని దానం ఇవ్వడం దానం ఇవ్వడం ద్వారా ఈ పండుగ దాతృత్వ గుణాలను, ఇతరులపై జాలి, కరుణ, దయ వంటివి చూపించాలనే స్ఫూర్తిని చాటుతుంది.

బక్రీద్ రోజున ఖుర్బానీని పంచుకోవడం, రుచికరమైన విందు భోజనాలను చేయడం, అందరితో కలిసి ఆనందంగా వేడుక చేసుకోవటం ద్వారా అల్లా తన ప్రేమను అందరికీ పంచుతారని, తనపై విశ్వాసం ఉంచిన అందరినీ ఆనందంగా ఉంచుతారనే అర్థాన్ని సూచిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version