తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈ మధ్య కాలంలో పెద్దగా మీడియాలో కనబడటం లేదు. అప్పుడు అప్పుడు కనబడినా సరే ఆయన అధికార పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించడం లేదు. అలాగే విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా పెద్దగా మీడియాతో కార్పొరేషన్ ఎన్నికల తర్వాత మాట్లాడే ప్రయత్నం చేయలేదు. అలాగే గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా కార్పొరేషన్ ఎన్నికల్లో సమర్థవంతంగా ప్రచారం చేయలేకపోయారు.
గుంటూరులో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సరే ఆయన ముందుకు వెళ్ళలేదు అనే భావన చాలా వరకు వ్యక్తమవుతుంది. రాజకీయ అంశాలను దృష్టిలో పెట్టుకున్న గల్లా జయదేవ్ గుంటూరు పార్లమెంట్ పరిధిలో ప్రచారం చేసే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో ముగ్గురు ఎంపీలు సైలెంటుగా ఉండటం పట్ల ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.
తెలుగుదేశం పార్టీలో తమకు ప్రాధాన్యత లేదని భావించిన ముగ్గురు ఎంపీలు సైలెంట్ గా ఉంటున్నారు అని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో వీరి గురించి కామెంట్లు వినపడుతున్నాయి. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో ముగ్గురు ఎంపీలలో రామ్మోహన్ నాయుడు మాత్రమే కాస్త గట్టిగా తన స్వరం వినిపించారు. మిగిలిన ఇద్దరు ఎంపీలు కూడా సైలెంట్ గానే ఉన్నారు. రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కూడా పెద్దగా రాజ్యసభలో మాట్లాడే ప్రయత్నం చేయకపోవడంతో అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇప్పుడు అర్థం కాని పరిస్థితి.